nagidream
Telangana Govt Focus On Those Two Areas For Furture City: హైదరాబాద్ లో మరో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ కోసం ప్రధానంగా రెండు ఏరియాలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీంతో ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
Telangana Govt Focus On Those Two Areas For Furture City: హైదరాబాద్ లో మరో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ కోసం ప్రధానంగా రెండు ఏరియాలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీంతో ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
nagidream
ఇప్పుడు హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నగర శివారు ప్రాంతాలకు హైదరాబాద్ నగర విస్తరించడంతో పాటు కొత్తగా పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీలు ఉండగా.. నాలుగో సిటీని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ని తలదన్నేలా ముచ్చెర్లలో నాలుగో సిటీని నిర్మిస్తామని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులను కూడా ప్రకటించారు. దీంతో తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కొత్త సిటీ ఏర్పాటు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటితో పలు ఏరియాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకోనుంది.
ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో మరో బూమ్ రాబోతుందని తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన క్రెడాయ్ తెలంగాణ సదస్సు 2024లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నగర రియల్ ఎస్టేట్ రంగంలో మరో బూమ్ రాబోతుందని.. స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని మంత్రులు వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ అభివృద్ధికి బీజం పడిందని అన్నారు. అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్లే ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు వచ్చాయని అన్నారు. వీటి వల్లే హైదరాబాద్ సిటీకి ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. హైదరాబాద్ నగరానికి కృష్ణ, గోదావరి జలాలను, మెట్రో రైలు ప్రాజెక్టుని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, ముచ్చింతల వైపు ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామని.. ఆ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం కందుకూరులో చదరపు అడుగు స్థలం సగటున రూ. 2 వేలుగా ఉంది. అంటే గజం స్థలం సగటున రూ. 18 వేలుగా ఉంది. చదరపు అడుగు 2 వేలు ఉన్న ఈ ప్రాంతం ఫ్యూచర్ లో డెవలప్ అయ్యాక 5 వేలు, 6 వేలు పలుకుతుంది. అంతకంటే ఎక్కువ పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలా చూసినా గానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టిన వారికి భవిష్యత్తులో ఊహించని లాభాలను చూడవచ్చు. అలానే ముచ్చింతల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.