Vinay Kola
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా రెండవ దశ మెట్రో నిర్మాణ పనులను స్టార్ట్ చేసింది ప్రభుత్వం.
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా రెండవ దశ మెట్రో నిర్మాణ పనులను స్టార్ట్ చేసింది ప్రభుత్వం.
Vinay Kola
హైదరాబాద్ మెట్రో రైల్ ఫస్ట్ స్టేజీలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ ప్రాజెక్టును ఏకంగా రూ.22,000 కోట్ల తో నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది పైగా హైదరాబాద్ మెట్రోలో జర్నీ చేస్తున్నారు. సెకండ్ స్టేజ్ అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉన్నట్లు గతంలో అంచనా వేశారు. మెట్రో రైల్ ఫస్ట్ స్టేజ్ లో హైదరాబాద్ దేశంలోనే ఢిల్లీ తర్వాత 2వ స్థానంలో నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది. అయితే గత ఏడేండ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు. ఈ సమయంలో మిగిలిన సిటీలు తమ మెట్రో రెండవ, మూడవ స్టేజ్ నిర్మాణాలను కూడా కంప్లీట్ చేసుకున్నాయి. దీనితో.. ఒకప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ మెట్రో.. 9వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న సిటీలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ మహా నగరాన్ని దాటేశాయి. అయితే తాజాగా ప్రభుత్వం మెట్రో విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజు రోజుకి చాప కింద నీరులా పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో హైదరాబాద్ మెట్రోను మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా సెకండ్ స్టేజీలో 6 కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మెట్రోను నిర్మించేందుకు అధికారులు రెఢీ అవుతున్నారు. దీనికి సంబందించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా కంప్లీట్ అయిపోయింది.ప్రస్తుతం మూడు కారిడార్లు ఉండగా.. రెండో దశలో కొత్తగా ఆరు కారిడార్లకు విస్తరించనున్నారు. నాలుగో కారిడార్ నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు, 5వ కారిడార్ రాయదుర్గ్–కోకాపేట్ నియోపొలిస్ వరకు, 6వ కారిడార్ ఎంజీబీఎస్–చంద్రాయణ గుట్ట వరకు, 7వ కారిడార్ మియాపూర్–పటాన్చెరు వరకు, 8వ కారిడార్ ఎల్ బీ నగర్–హయత్ నగర్ వరకు 9వ కారిడార్ ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ వరకు నిర్మిస్తారు.
ఈ మెట్రో రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు పీపీపీ విధానంలో చేపడతారు. ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ రూ.24,269 కోట్లుగా ఉంది. అందులో 30 % అంటే రూ.7333 కోట్ల బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది. 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది.ఇక అప్పుగా రూ.11,693 కోట్లు సేకరించనున్నారు. అలాగే కొన్ని ప్రైవేటు సంస్థల నుంచి రూ.1,033 కోట్ల నిధులు సేకరించనున్నారు. ఇదీ సంగతి. ఇక ఈ కొత్త మెట్రో నిర్మాణం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.