ఫుడ్ డెలివరీ బాయ్స్ కొత్త తరహా మోసం! మీ ఫుడ్ కల్తీ చేస్తున్నారని తెలుసా?

Food Delivery: నేటి కాలంలో ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని డెలివరీ బాయ్స్‌ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..

Food Delivery: నేటి కాలంలో ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని డెలివరీ బాయ్స్‌ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..

కరోనా సమయంలో కాస్త తగ్గిన ఫుడ్ డెలివరీ వ్యాపారం మళ్లీ ఇప్పుడు పుంజుకుంది. వండుకునే ఓపిక లేక.. కొత్త రుచులు ఆస్వాదించాలనే కోరిక.. ఎక్కువ మంది బంధువులు వచ్చిన వేళ వంట కోసం ఇబ్బంది పడే పని లేకుండా చాలా మంది ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ చేసే యాప్‌లు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఇక ప్రారంభంలో ఇవి ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పటికి కూడా డిస్కౌంట్‌ ఆఫర్లు భారీగా ఇస్తూ.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల వల్ల ఎందరికో ఉపాధి లభించింది. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ నయా దందాకు తెరలేపారు. మన దగ్గర నుంచి అధిక మొత్తం వసూలు చేస్తూ.. కల్తీ ఆహారాన్ని మనకు అంటగడుతున్నారు. ఇంతకు వారు ఎలా మోసం చేస్తున్నారంటే..

ఫుడ్‌ డెలవరీ బాయ్స్‌ నయా మోసానికి తెర తీశారు. కస్టమర్లు ఆర్డర్‌ చేసిన చోట నుంచి కాకుండా.. వారు ముందుగా ఒప్పదం కుదుర్చుకున్న హోటల్స్‌, రోడ్‌ సైడ్‌ బండ్ల దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నాయి. పోనీ అదేమైనా తాజా ఆహారమా అంటే కాదు. మిగిలిపోయిన, పాచిపోయిన, ఏమాత్రం క్వాలిటీ లేని ఆహారాన్ని.. ప్యాక్‌ చేసి తీసుకువస్తున్నారు. సాధారణంగా మనం ఆర్డర్‌ చేసిన ఫుడ్‌కి ఎంత లేదన్న 300 రూపాయలు పడితే.. డెలివరీ బాయ్స్‌ తెచ్చే నాణ్యత లేని ఆహారానికి మాత్రం కేవలం 100-150 రూపాయల వరకే ఖర్చవుతుంది. ఇలా రోజుకు 3,4 ఆర్డర్ల మీద మోసం చేస్తే చాలు.. వారి రోజు వారి సంపాదన వచ్చేస్తుంది. పైగా చాలా మంది ఆర్డర్‌ తీసుకువచ్చాక పేమెంట్‌ చేస్తారు కాబట్టి సదరు డెలివరీ బాయ్స్‌.. తమ యూపీఐ యాప్స్‌కు పేమెంట్‌ చేయించుకుకంటున్నారు. అలా మన దగ్గర నుంచి భారీగా వసూలు చేసి.. కల్తీ ఆహారాన్ని మనకు అంటగడుతున్నారు.

చాలా సమయాల్లో కస్టమర్లు దీన్ని పట్టించుకోవడం లేదు. డెలివరీ రాగానే దాన్ని తీసుకుని.. డబ్బులు చెల్లించి.. ఆర్డర్‌ తీసుకుంటున్నారు. తర్వాత ఆ ఆహారాన్ని పరిశీలిస్తే.. చల్లగా ఉండటమో.. ప్యాకింగ్‌ వేరుగా ఉండటమో.. రుచి, శుచి లేకుండా ఉండటం వంటివి గమనిస్తున్నారు. కానీ అప్పుడు ఏం చేయడానికి ఉండదు. ఆ ఆహారం చూస్తే.. అసలు మనం తినే రెస్టారెంట్‌ నుంచే తీసుకొచ్చారా అనే అనుమానం కలుగుతుంది. దాని గురించి అడుగుదామంటే.. అప్పటికే వారు డెలివరీ బాయ్‌ వెళ్లిపోయి ఉంటాడు.

ప్రశ్నిస్తే.. కస్టమర్‌ మీదకే రివర్స్‌..

ఒకవేళ మీరు పేమెంట్‌ చేయడానికి ముందే మీ ఆర్డర్‌ మీరు చెప్పిన చోట నుంచి తీసుకురాలేదని.. ఫుడ్‌లో కూడా తేడా ఉందని అర్థం అయ్యింది అనుకొండి.. అప్పుడు దాని గురించి డెలివరీ బాయ్‌ను ప్రశ్నిస్తాం. దాంతో వారు తమ తప్పును కవర్‌ చేసుకోవాడనికి కస్టమర్ల మీదకే రివర్స్‌ అవుతున్నారు. పెద్ద పెద్దగా అరుస్తూ.. అక్కడ సీన్‌ క్రియేట్‌ చేస్తారు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మరి కొందరు డెలివరీ బాయ్స్‌ను తీసుకువచ్చి.. కస్టమర్లతో గొడవకు దిగుతారు. అందుకే చాలా సందర్భాల్లో ఈ తలనొప్పులు ఎందుకుని సైలంట్‌గా ఉంటున్నారు. కానీ ఇలానే వదిలేస్తే డెలివరీ బాయ్స్‌ రెచ్చిపోతారని.. దీని గురించి సదరు రెస్టారెంట్‌, ఫుడ్‌ డెలివరీ యాజమాన్యానికి తెలియజేయాలని.. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి మోసాలు తలెత్తే అవకాశం ఉండదని అంటున్నారు.

ఇలాంటి మోసాలను ఎలా గుర్తించాలంటే..

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే సమయంలో తరచు తాము ఎక్కడ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తారో.. వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కనుక మీకు సదరు రెస్టారెంట్‌ క్వాలిటీ స్టాండర్డ్స్‌, ప్యాకింగ్‌ విధానం.. మీ ఆర్డర్‌తో పాటు వచ్చే కాంప్లిమెంటరీస్‌ వీటన్నింటి గురించి మీకు బాగా తెలుసు. కనుక మీరు ఈసారి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ డెలివరీ సమయంలో.. ఇవన్ని ఉన్నాయో లేదో చెక్‌ చేసుకొండి. ఆ తర్వాతే పేమెంట్‌ చేయండి. ముందే డబ్బులు చెల్లిస్తే.. రిటన్‌ పెట్టి.. ఫిర్యాదు చేయండి.

Show comments