New Ration Cards: సీఎం రేవంత్‌ కీలక ప్రకటన.. కొత్త రేషన్‌ కార్డులు ఆ తేదీ నుంచే

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీ పథకాలకు.. రేషన్ కార్డు ఖచ్చితమని పేర్కొన్నారు, అయితే దీనిలో భాగంగా .. సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ గురించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీ పథకాలకు.. రేషన్ కార్డు ఖచ్చితమని పేర్కొన్నారు, అయితే దీనిలో భాగంగా .. సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీ గురించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత ఏడాది డిసెంబర్ 28 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వారానికి రెండు రోజులు జరిగిన ఈ కార్యక్రమానికి.. రాష్ట్ర నలుమూలల నుంచి .. భారీ ఎత్తున ప్రజలు తమ వినతులు అందించేందుకు వచ్చారు. ఇక ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 6వ తేదీతో ముగిసింది. కాగా, ఎన్నికల సమయంలో వెల్లడించిన ఆరు గ్యారంటీ పథకాలలో కేవలం ఐదు గ్యారంటీ దరఖాస్తులను మాత్రమే తీసుకున్నారు, దానిలో యువ వికాసం గ్యారెంటీకి మాత్రం దరఖాస్తులను ఆహ్వానించలేదు. అయితే, ఈ ఐదు గ్యారంటీ పథకాలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఆ అప్లికేషన్స్ ను పరిశీలించిన అధికారులు.. అర్హులైన వారికీ గ్రామాల వారీగా స్లిప్స్ ను కూడా అందించనున్నారు.

ఇక అవి మాత్రమే కాకుండా.. చాలా మంది రేషన్ కార్డులు లేని వారు .. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ ను అందించారు . ఆ ఐదు గ్యారంటీల కంటే కూడా కొత్త రేషన్ కార్డుల కోసం .. అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడం ఆశ్చర్యం. ఈ క్రమంలో ప్రజల నుంచి మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని.. వాటిలో ‘అభయహస్తం’ పేరుతో ఐదు గ్యారంటీలకు 1,05,91,636 అప్లికేషన్లు అందాయని .. రేషను కార్డు, ధరణి తదితరాల కోసం అదనంగా మరో 19,92,747 అప్లికేషన్లు వచ్చాయని.. అధికారులు పేర్కొన్నారు. అవే కాకుండా దాదాపు 20 లక్షల అప్లికేషన్లు.. అభయహస్తం పేరుతో తీసుకున్న దరఖాస్తుల కంటే అదనంగా వచ్చాయట. . వీటన్నిటి పరిధిలోని మొత్తం 1,11,46,293 కుటుంబాల నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

అయితే, ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు రేషన్ కార్డు ముఖ్యమని తెలిపారు. ఏ ఆధారం లేకుండా పథకాలను అమలు చేస్తే నిధులు దర్వినియోగం అవుతాయని.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుబంధు డబ్బులను.. అనర్హులకు ఇచ్చి కొన్ని కోట్ల రూపాయాలను వృథా చేసిందని వెల్లడించారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలనే ఉద్దేశంతోనే .. రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు తెలిపారు. దీని వలన ఏ పేదవారికి కూడా నష్టం జరగదని పేర్కొన్నారు. లేకపోతే.. కోటీశ్వరులు కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇక రేషన్ కార్డులు లేని వారికి త్వరలోనే మంజూరు చేస్తామని తెలియజేశారు. మార్చి నెల రెండో వారం నుంచి లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేస్తామన్నారు. రేషన్ కార్డు వచ్చిన తర్వాత మండల ఆఫీస్ లో గ్యారెంటీ పథకాలకు దరఖాస్తలు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా ఇదిలా ఉండగా.. రేషన్ కార్డు కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆదేశించారు.. దీనికి రెండు రోజులు మాత్రమే గవువు ఉంది. అంటే ఫిబ్రవరి 29వ తేదీలోపు ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

Show comments