iDreamPost
android-app
ios-app

విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు.. మహిళలు కూడా అర్హులే

JLM AE Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది. విద్యుత్ సంస్థల్లో 3500 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.

JLM AE Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది. విద్యుత్ సంస్థల్లో 3500 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.

విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు.. మహిళలు కూడా అర్హులే

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ఇటీవల డీఎస్సీ ద్వారా 11 వేల పైచిలుకు టీచర్ జాబ్స్ ను భర్తీ చేసింది రేవంత్ సర్కార్. కొన్ని రోజుల క్రితం గ్రూప్ 4 ఫైనల్ ఫలితాలను ప్రకటించింది. దీని ద్వారా 8 వేలకు పైగా జాబ్స్ భర్తీ అవుతున్నాయి. గత నెలలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. వీటి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 17న గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించింది తెలంగాణ సర్కార్. వచ్చే నెలలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించబోతున్నది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించి నియామకాలు చేపడతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆశావాహులు ప్రిపరేషన్ లో మునిగిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ మరో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి రెడీ అవుతున్నట్టు సమాచారం. వందో రెండు వందలో కాదు ఏకంగా 3,500 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ నగరం కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో (టీఎన్ ఎస్పీడీసీఎల్) కలిపి 3,500 జూనియర్‌ లైన్‌మెన్‌, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటి భర్తీకి ఈనెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేఎల్‌ఎంతో పాటు 50 వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు టీజీఎస్‌పీడీసీఎల్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు మహిళలను కూడా అర్హులుగా చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ మహిళలకు వరంగా మారనుంది.

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు మహిళలు సైతం పోటీ పడి ఉద్యోగాలు దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ ను వదులుకోకండి. టెన్త్ తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుదారుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. జీతం, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు తెలుసుకోవాలంటే అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.