iDreamPost
android-app
ios-app

దారుణం! అద్దెల్లు కోసం వచ్చి కళ్లల్లో కారం కొట్టి హత్య చేశారు!

  • Published Nov 27, 2024 | 3:27 PM Updated Updated Nov 27, 2024 | 3:27 PM

Khammam: ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. అద్దె ఇల్లు కోసం వచ్చి ఇద్దరు దామపతులను దారుణంగా హత్య చేశారు.

Khammam: ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. అద్దె ఇల్లు కోసం వచ్చి ఇద్దరు దామపతులను దారుణంగా హత్య చేశారు.

  • Published Nov 27, 2024 | 3:27 PMUpdated Nov 27, 2024 | 3:27 PM
దారుణం! అద్దెల్లు కోసం వచ్చి కళ్లల్లో కారం కొట్టి హత్య చేశారు!

ఖమ్మం జిల్లాలో మహా దారుణం చోటుచేసుకుంది. ఇంటికి అద్దె కోసం వచ్చి భార్యాభర్తలను అతి కిరాతకంగా చంపారు దుండగులు. నేలకొండపల్లిలో నివసిస్తున్న ఎర్రా వెంకటరమణ అనే వ్యక్తి ఇంటికి రెంట్ కోసం పది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాళ్ళే వీళ్ళని చంపిన రాక్షసులు అయ్యారు. ఇల్లు తమకు నచ్చిందంటూ అడ్వాన్స్‌గా యజమాని డిమాండ్‌ చేయగా కొంత డబ్బును ఆ ముగ్గురు వ్యక్తులు ఇచ్చి వెళ్లారు. ఇక ఆ తర్వాత రాత్రి వచ్చారు. యజమానితో బాగా కలిసిపోయారు.ఆ రాత్రి వారి ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళారు. మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో మళ్ళీ వచ్చారు. ప్లాన్ ప్రకారం వెంకటరమణను ఆయన భార్య కృష్ణ కుమారిని హత్య చేశారు. అది కూడా అత్యంత దారుణంగా కళ్ళలో కారం కొట్టి మరీ హత్య చేశారు. హత్య చేసి ఏం చేశారో తెలుసా? తెలిస్తే కచ్చితంగా వణికిపోతారు.. ఇంతకీ ఏం చేశారంటే..

వారిని దారుణంగా హత్య చేసి ఆ తర్వాత వారి ఇంట్లో ఉన్న నగదు, బంగార నగలు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. వెళ్లే ముందు డౌట్ రాకూడదని ఇంటి చుట్టూ కారం చళ్లారు. రోజూ లాగానే వెంకటరమణ కుమార్తె ఫోన్ చేయగా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తల్లిదండ్రులు ఫోన్‌ లీఫ్ట్‌ చేయక పోవటంతో ఆమెకు అనుమానం వచ్చింది. కంగారు పడింది. ఆమె వెంటనే పై ఇంట్లోనే అద్దెకు ఉన్నవారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడటంతో తాళం వేసి ఉందని, ఇంటి చుట్టూ కారం చల్లి ఉన్నదని చెప్పారు. తాళం పగలగొట్టి చూడగా వెంకట రమణ, కృష్ణ కుమారి మృతదేహాలు ఉన్నాయి. వారిని చూసి షాక్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును జాగ్రత్తగా పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్ క్లూస్ ని టీమ్ అధికారులు సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పరిసరాలను జాగ్రత్తగా గాలించారు. అలాగే పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా జాగ్రత్తగా పరిశీలించారు పోలీసులు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణమైన ఘటన చూసి స్థానికులు గజ గజ వణికి పోతున్నారు. కాబట్టి అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ దారుణమైన హత్య గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetHoliganbetHoliganbetHoliganbetcasibomjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş