iDreamPost
android-app
ios-app

భర్తకు లివర్ దానం చేసి..పునర్జన్మనిచ్చిన భార్య

  • Published Nov 21, 2024 | 6:03 PM Updated Updated Nov 21, 2024 | 6:03 PM

Khammam: ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల గురించి చాలానే వార్తలు వింటూ వస్తున్నాం. ఇప్పటి జెనరేషన్ వారికి అసలు పెళ్లి అంటేనే అదొక పెద్ద ఇబ్బందిలా భావిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు , గొడవలతో దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకునే ఆ ఇద్దరు మాత్రం.. చావుని ఎదురించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టసుఖాల్లో కలకాలం తోడుగా ఉంటానని పెళ్లి నాట చేసిన ప్రమాణాలను ఆ మహిళ నిరూపించింది.

Khammam: ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల గురించి చాలానే వార్తలు వింటూ వస్తున్నాం. ఇప్పటి జెనరేషన్ వారికి అసలు పెళ్లి అంటేనే అదొక పెద్ద ఇబ్బందిలా భావిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు , గొడవలతో దూరం అవుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకునే ఆ ఇద్దరు మాత్రం.. చావుని ఎదురించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టసుఖాల్లో కలకాలం తోడుగా ఉంటానని పెళ్లి నాట చేసిన ప్రమాణాలను ఆ మహిళ నిరూపించింది.

  • Published Nov 21, 2024 | 6:03 PMUpdated Nov 21, 2024 | 6:03 PM
భర్తకు లివర్ దానం చేసి..పునర్జన్మనిచ్చిన భార్య

ప్రస్తుతం సమాజంలో వివాహ బంధాల గురించి చాలానే వార్తలు వింటూ వస్తున్నాం. ఇప్పటి జెనరేషన్ వారికి అసలు పెళ్లి అంటేనే అదొక పెద్ద ఇబ్బందిలా భావిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు , గొడవలతో దూరం అవుతున్నారు. ఇరువురిలో ఏ ఒక్కరికి కూడా ఓపిక , సహనం, ఆలోచన ఉండడం లేదు. పెళ్లి అనేది జన్మ జన్మల అనుంబంధం అని.. భార్య భర్తల బంధం చాలా బలమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటివారు కాస్త కష్టానికే కుంగిపోవడం , బాధ పడడం.. చివరికి చావును సైతం ఎంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు చెప్పుకునే ఆ ఇద్దరు మాత్రం.. చావుని ఎదురించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టసుఖాల్లో కలకాలం తోడుగా ఉంటానని పెళ్లి నాట చేసిన ప్రమాణాలను ఆ మహిళ నిరూపించింది. పెళ్లి తర్వాత ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. తన భర్తకు కాలేయదానం చేసి ఆయుష్షు పెంచింది.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను అనే వ్యక్తి.. ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకు లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో.. అనుకోని అతిథిలా అనారోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో టెస్ట్ లు చేయించుకున్నాడు. కామెర్లు సోకడంతో కాలేయ సమస్య ఉందని డాక్టర్స్ చెప్పారట. దీనితో ఆ దంపతులకు ఏమి చేయాలో పాలుపోలేదు. ట్రీట్మెంట్ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగారట. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టినా కానీ ప్రయోజనం లేకుండా పోయిందట. అనేక టెస్ట్స్ తర్వాత కాలేయ మార్పిడి జరిగితే శ్రీను బ్రతికే అవకాశం ఉందని డాక్టర్స్ తేల్చి చెప్పారు. దీనితో కాలేయ దానం కోసం బంధువులు , తెలిసిన వారు అందరిని ఆరా తీసి.. అనేక ప్రయత్నాలు చేశారట.

చివరికి ఎక్కడా దొరకక నిరాశలో మిగిలిపోయారట ఈ దంపతులు. ఈ క్రమంలో తన భర్తను బ్రతికించుకోవడానికి లావణ్య ముందుకు వచ్చింది. తన భర్త కోసం తన లివర్ ఇస్తానని చెప్పడంతో.. డాక్టర్స్ కొన్ని టెస్ట్స్ చేసి అది సరిపోతుందని నిర్దారించారు. అప్పుడు ఆమె లివర్ నుంచి 65 శాతం వరకు తీసి.. సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారట సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్. ఇలా సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం భార్య భర్తలిద్దరూ కూడా ఆరోగ్యాంగా ఉన్నట్లు సమాచారం. భర్తను బ్రతికించుకోవాలని లావణ్య పడిన ఆరాటం.. ఆమె చేసిన త్యాగమే శ్రీనును బ్రతికించింది. సుఖ దుఃఖాలలో తోడుగా నిలిచి భర్తను కాపాడుకుంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. నెటిజన్లు వీరి దాంపత్య బంధాన్ని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా భార్య భర్తల బంధానికి ఉన్న గొప్ప తనాన్ని వీరిద్దరూ మరోసారి నిరూపించి చూపించారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.