ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ ఇటీవల పలు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఛానెల్స్ ఫీచర్‌తో పాటు నచ్చిన ప్రముఖులను, సంస్థలను అనుసరిస్తూ అప్డేట్స్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్. దీని ద్వారా మెసేజ్ పంపినంత సులభంగా ఆన్లైన్ ఆర్డర్లు, పేమెంట్లు చేసుకోవచ్చు. వినియోగదారులకు షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ‘ఫ్లో’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
ఫ్లో ఫీచర్ ద్వారా వ్యాపారులతో పాటు యూజర్లు మల్టీ సర్వీసులను ఒకేచోట పొందనున్నారు. ఫ్యూచర్లో బిజినెస్ అకౌంట్ యూజర్ల కోసం ఇలాంటి అనేక కొత్త ఆప్షన్లను యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లో ఫీచర్ ప్రయోజనాల విషయానికొస్తే.. మీ వాట్సాప్ యాప్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, అపాయింట్మెంట్ బుకింగ్ లాంటి సేవల్ని సులభంగా చేసుకోవచ్చు. వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్లను కలిగి ఉన్నవారి కోసం నిర్దిష్ట క్యాలెండర్లతో పాటు మరెన్నో ఆప్షన్లు రానున్నట్లు సమాచారం.
ఫ్లో ఫీచర్ కోసం వాట్సాప్ ఒక సపోర్ట్ పేజీని క్రియేట్ చేస్తుంది. అందులో అపాయింట్మెంట్, ఫారం ఫిల్లింగ్, ప్రాడక్ట్ కస్టమైజేషన్ లాంటి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాట్సాప్ యూజర్లకు ఈ ఆప్షన్లన్నీ అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఫ్లో ఫీచర్ అందుబాటులోకి వస్తే థర్డ్ పార్టీ యాప్‌లతో అవసరం లేకుండా పోతుంది. ఇప్పటికే మన దేశంలోని అనేక వ్యాపార సంస్థలతో ఈ ఫ్లో ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేసింది. రెడ్ బస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఈ-కామర్స్ యాప్స్‌లో పొందే ఆప్షన్లన్నీ ఇక మీదట వాట్సాప్‌లోనే అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ స్పష్టం చేసింది.
షాపింగ్, ఫుడ్ ఆర్డర్, టికెట్ బుకింగ్‌తో పాటు ఈ-మెసేజింగ్ యాప్ ఫెసిలిటీని కూడా తీసుకురానున్నామని వాట్సాప్ తెలిపింది. అయితే ఈ సేవల కోసం బిజినెస్ అకౌంట్ యూజర్ల నుంచి ఎంతమేరకు వసూలు చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు పేమెంట్స్ కోసం రాజర్‌పే, పేయూతో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటి ద్వారా వినియోగదారులు క్షణాల్లో లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇప్పటిదాకా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు యూజర్లు వాట్సాప్‌ను వాడేవారు. ఇక నుంచి ఇతర యూపీఐలు, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన చెల్లింపులు కూడా యాప్‌లోనే చేయొచ్చని వాట్సాప్ ప్రకటించింది.
ఇదీ చదవండి: చంద్రబాబుకు షాక్.. కస్టడీకి గ్రీన్ సిగ్నల్!