Vinay Kola
WhatsApp Web: చాలా మంది కూడా డెస్క్ టాప్ లో వాట్సాప్ వెబ్ వాడుతూ ఉంటారు. కానీ సెక్యూరిటీ ఫీచర్ ని వినియోగించుకోరు.
WhatsApp Web: చాలా మంది కూడా డెస్క్ టాప్ లో వాట్సాప్ వెబ్ వాడుతూ ఉంటారు. కానీ సెక్యూరిటీ ఫీచర్ ని వినియోగించుకోరు.
Vinay Kola
వాట్సాప్ ఎప్పుడూ కూడా తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూనే ఉంది. వాట్సాప్ లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇక వాట్సాప్ వెబ్ కోసం సెక్యూరిటీ ఫీచర్ ఉంది. ఎందుకంటే ఆఫీసుల్లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో వాట్సాప్ వెబ్ వాడే యూజర్లు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ నుంచి వాట్స్ యాప్ వాడుతున్నప్పుడు తమ డేటాని వెనకవాళ్ళు చూస్తారేమో చిన్నపాటి భయం. కొందరు వ్యక్తులు మనం ఏమరుపాటుగా ఉండడం చూసి.. మన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లను ఓపెన్ చేసి చూస్తారనే భయం ఉంటుంది. కొన్నిసార్లు మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంటుంది. అయితే దీనిని నివారించడానికి చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు వాట్సాప్ నుంచి లాగ్అవుట్ అవుతూ ఉంటారు.
తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాక మళ్ళీ లాగిన్ అవుతూ ఉంటారు. అయితే ఇలా మాటిమాటికీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లాగిన్ కావటం అనేది విసుగు తెప్పించే అంశం. పైగా తరచూ లాగ్అవుట్, లాగిన్ అవుతూ ఉంటే.. గత మెసేజ్‌లు ఒక్కోసారి వెంటనే కనిపించకపోవచ్చు కూడా. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ వాట్సాప్ వాట్సాప్ స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మన డేటా సేఫ్టీకి ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫీచర్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా మీరు web.whatsapp.com ని ఓపెన్ చేయాలి. ఆ తరువాత క్యూఆర్ కోడ్‌తో web.whatsapp.com లోకి లాగిన్ కావాలి. తరువాత స్క్రీన్ పైన ఉన్న సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి.ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే..అక్కడ స్క్రీన్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ స్క్రీన్ లాక్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత..వాట్సాప్ స్క్రీన్ మీద కనిపించే సూచనలు పాటిస్తూ ఒక పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. అలాగే మీరు కావాలనుకుంటే స్క్రీన్ లాక్ టైమింగ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వాట్సాప్ వెబ్ ని సేఫ్ గా వాడుకోవచ్చు. కాబట్టి వాట్సప్ వెబ్ వాడేవారు కచ్చితంగా ఈ వాట్సాప్ స్క్రీన్ లాక్ సేఫ్టీ ఫీచర్ ని వాడండి. ఇక ఈ సేఫ్టీ ఫీచర్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.