Vinay Kola
WhatsApp: వాట్స్ యాప్ లో చాలా రకాల స్కాములు జరుగుతున్నాయి. తాజాగా మరొక స్కామ్ వెలుగులోకి వచ్చింది.
WhatsApp: వాట్స్ యాప్ లో చాలా రకాల స్కాములు జరుగుతున్నాయి. తాజాగా మరొక స్కామ్ వెలుగులోకి వచ్చింది.
Vinay Kola
వాట్స్ యాప్ చాలా సేఫ్ అని అందరూ నమ్ముతారు. కానీ వాట్స్ యాప్ లో కూడా అనేక స్కాములు చేస్తారు స్కామర్స్. వాళ్ళు చేసేది మోసం అని తెలిసేలోపే మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో ఈ సీజన్ లో కొత్త రకమైన నేరాలను ప్లాన్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. పెళ్లి కానీ లేదా పెళ్ళికి సంబంధించిన పనులు కానీ చాలా మందికి ఇంట్రెస్ట్ పుట్టిస్తుంటాయి. అలాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు మోసగాళ్ళు. సాధారణంగా మనం పెళ్ళికి ఆహ్వానించడానికి పెళ్లి కార్డును ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదా వాట్సాప్ లో పంపించడమో చేస్తుంటాం. అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో పెళ్లి కార్డును పంపిస్తున్నారు. ఇలా పంపించే పెళ్లి కార్డులు సైబర్ నేరగాళ్లకు కొత్త ఆలోచనలు క్రియేట్ చేశాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడే ఐడియా వారికి వచ్చింది. దీంతో వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ వాట్సాప్ లో కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఇంట్రెస్ట్ తో ఆ లింకులు ఓపెన్ చేశామంటే ఇక అంతే సంగతులు. మన బ్యాంక్ లో ఉన్న అమౌంట్ మొత్తం స్వాహా ఐపోతుంది. అందుకే ఇలా వచ్చే ప్రతి లింకును క్లిక్ చేయవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఇలాంటి ఫేక్ ఇన్విటేషన్‌లపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ అనగానే చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావటంతో దూరపు చుట్టాల నుంచి స్నేహితుల వరకు అందరికీ వాట్సాప్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించడం కామన్ అయిపోయింది. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ని క్యాష్ చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇలాంటి గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే వెడ్డింగ్ ఇన్విటేషన్ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చస్తున్నారు.సైబర్ మోసగాళ్ళు వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ఓ APK ఫైల్ ను క్రియేట్ చేసి వాట్సాప్ కు పంపిస్తున్నారు.
ఇక ఆ ఫైల్ ఓపెన్ చేయగానే మనకి తెలియకుండానే ఓ థార్ట్ పార్టీ యాప్ లేదా సైట్ ఓపెన్ అయిపోయి.. మన ఫోన్ నుంచి మన కాంటాక్ట్ నంబర్స్ అన్నిటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. దీని ద్వారా మన పర్సనల్ డేటా తో పాటు సైబర్ నేరగాళ్లకు చెందిన సాఫ్ట్‌వేర్ కూడా మన ఫోన్లో ఈజీగా ఇన్‌స్టాల్ అవుతుంది. కానీ అది మనకు కనపడదు. అయితే దీని ద్వారా మన బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, మన పర్సనల్ డేటా ఇంకా ఇతర వివరాలు అన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అందుకే ఇలాంటి మోసాలు జరగకుండా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. పొరపాటున కూడా ఇలాంటి లింకులను క్లిక్ చేస్తే.. వెంటనే ఏమాత్రం 1930 నెంబర్ కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదీ సంగతి. ఇలాంటి లింకులు ఎన్ని వచ్చినా కూడా అస్సలు క్లిక్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి.. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.