iDreamPost
android-app
ios-app

యాపిల్ డివైజ్‌లు వాడుతున్నారా?.. కేంద్రం ‘హైరిస్క్‌’ అలర్ట్‌.. ఎందుకంటే?

Apple Devices: యాపిల్ డివైజెస్ వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ ఐఫోన్స్, ఐప్యాడ్, వాచ్ లు వాడే వారు ఇది తెలుసుకోండి.

Apple Devices: యాపిల్ డివైజెస్ వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ ఐఫోన్స్, ఐప్యాడ్, వాచ్ లు వాడే వారు ఇది తెలుసుకోండి.

యాపిల్ డివైజ్‌లు వాడుతున్నారా?.. కేంద్రం ‘హైరిస్క్‌’ అలర్ట్‌.. ఎందుకంటే?

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఎక్కువ. యాపిల్ ఐఫోన్, వాచ్, ఐప్యాడ్ వంటి యాపిల్ డివైజ్ లను ఎగబడి కొంటుంటారు. యాపిల్ ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ అయితే చాలు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. టెక్ ప్రియులు యాపిల్ డివైజ్ లను అంతలా ఇష్టపడుతుంటారు. యాపిల్ ఉత్పత్తులకు అంత డిమాండ్ ఎందుకంటే అందులోని సెక్యూరిటీ ఫీచర్స్. క్వాలిటీ, అద్భుతమైన పనితీరు కారణంగా ఐఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్డ్స్ ఫీచర్లు కలిగిన ఐఫోన్లకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ధర ఎక్కువైనా సరే యాపిల్ డివైజ్ లను కొనేందుకు మాత్రం వెనకాడరు. యాపిల్ కు చెందిన ఐఫోన్స్, వాచ్ లను యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది.

మరి మీరు కూడా యాపిల్ డివైజ్ లు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. యాపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్స్‌, మ్యాక్స్‌, యాపిల్‌ వాచీలు వాడుతున్నవారిని కేంద్రం అలర్ట్‌ చేసింది. యాపిల్ డివైజ్ లు వాడే వారికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. యాపిల్ డివైజ్ లు యూజ్ చేసే వారికి పొంచి ఉన్న ముప్పు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న యాపిల్ డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈమేరకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ అడ్వైజరీని జారీ చేసింది. ఆయా డివైజులు వాడుతున్న వారికి ‘హైరిస్క్‌’ పొంచి ఉన్నట్లు పేర్కొంది. ఔడేటెడ్ సాఫ్ట్ వేర్ లో సెక్యూరిటీ లోపాల కారణంగా సైబర్ క్రిమినల్స్ సున్నితమైన డేటాను యాక్సెస్ చేయడం లేదా మానిప్యులేషన్ కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది.

ఐఓస్‌ 18.1 కంటే ముందు వెర్షన్‌ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్‌ఓఎస్‌ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్‌ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్‌ఓఎస్‌ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్‌ ఓఎస్‌ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్‌ కలిగిన యాపిల్‌ వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. వీటితో పాటు పాత టీవీఓఎస్‌, విజన్‌ఓఎస్‌, సపారీ బ్రౌజర్లకూ ఇదేతరహా ముప్పు పొంచిఉందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. అయితే, పాత సాఫ్ట్‌వేర్‌లో లోపాలను యాపిల్‌ ఇదివరకే గుర్తించి కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌లో పరిష్కారం చూపిందని తెలిపింది. ఇంకా ఎవరైనా పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు వాడుతున్నారో వారు వెంటనే తమ యాపిల్ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. సైబర్ క్రిమినల్స్ బారినపడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ ను అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్‌-ఇన్ సూచించింది.