Microsoft: బ్రేకింగ్ : మైక్రోసాఫ్ట్ విండోస్‌ క్రాష్.. బ్యాంకింగ్, విమాన సేవలకి అంతరాయం!

Technical Issue In Microsoft Server: దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా అనేక సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ వివరాలు..

Technical Issue In Microsoft Server: దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా అనేక సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ వివరాలు..

దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిస్టమ్స్‌ అన్ని షట్‌డౌన్‌ అవుతున్నాయి. ఈ సాంకేతిక సమస్య కారణంగా అంతర్జాతీయంగా విమాన, బ్యాంకింగ్‌, షేర్‌ మార్కెట్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యల వల్ల అమెరికా సహా అనేక దేశాల్లో విమాన, బ్యాంకింగ్‌ సేవలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతుంది. ఎయిర్‌పోర్టుల్లో చెకిన్‌ సిస్టమ్స్‌కు అంతరాయం ఏర్పడింది. అలానే దేశీయ విమాన సంస్థలైన ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌, ఆకాశా ఎయిర్‌లైన్స్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ సేవలు, టికెట్‌ బుకింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే సాఫ్ట్‌వేర్‌ హ్యాకింగ్‌కు గురైందని.. అందుకే ఈ సమస్య తలెత్తిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విండోస్‌ సాంకేతిక సమస్య కారణంగా.. విమానయాన రంగ సంస్థల్లో ఆన్‌లైన్‌ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఆయా సంస్థలు.. సమస్యపై ట్వీట్‌ చేస్తూ.. ఆన్‌లైన్‌ సర్వీసులు తాత్కలికంగా అందుబాటులో ఉండవని తెలియజేశాయి. అలానే అమెరికాలోని ప్రధాన విమానయాన సంస్థలు కూడా ఈ సాంకేతిక సమస్య గురించి కీలక ప్రకట చేశాయి. ఈ సందర్భంగా అమెరికా ట్రాన్స్‌పోర్ట్‌ కార్యదర్శి పీట్‌ బుట్టిగీగ్‌ మాట్లాడుతూ.. విమానాల రద్దు, ఆలస్యానికి సంబంధించిన అంశంపై సదరు డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇతర విమానయాన సంస్థల ప్రయాణికులు అవసరాలను తీర్చడానికికి తమ అధికారులు పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సాంకేతిక సమస్య వల్ల మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ వినియోగిస్తున్న మిలియన్ల మంది యూజర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన చేసింది. తమ సిబ్బంది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని.. యూజర్లకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలుపుతున్నామని.. ఇప్పటికే సమస్య కొంతమేర కొలిక్కి వచ్చింది అని ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన చేసింది.

అయితే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో లోపం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని.. టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసి బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌ను ఎదుర్కొన్నట్లయితే.. వెంటనే మీ ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను షట్‌డౌన్‌ చేసి.. కొత్త హార్డ్‌వేర్‌ను తీసివేసి.. రీస్టార్ట్‌ చేయడానికి ప్రయత్నించాలని వారు సూచిస్తున్నారు. ఒకవేళ అప్పటికి కూడా రీస్టార్ట్‌ కాకుంటే.. పీసీని సేఫ్‌మోడ్‌లో ఆన్‌ చేయాలని సూచిస్తున్నారు.

Show comments