రెడ్ మీ నుంచి అదిరిపోయే బడ్స్.. ఈ సేల్ లో అస్సలు మిస్ కావొద్దు!

Redmi Buds 5C Specifications And Price Details: రెడ్ మీ నుంచి ఇప్పుడు అదిరిపోయే బడ్స్ రాబోతున్నాయి. అవి లుక్స్ పరంగా చూసుకుంటే యాపిల్ ఎయిర్ పోడ్స్ లా ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే ధర మాత్రం బడ్జెట్ లోనే ఉంది.

Redmi Buds 5C Specifications And Price Details: రెడ్ మీ నుంచి ఇప్పుడు అదిరిపోయే బడ్స్ రాబోతున్నాయి. అవి లుక్స్ పరంగా చూసుకుంటే యాపిల్ ఎయిర్ పోడ్స్ లా ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే ధర మాత్రం బడ్జెట్ లోనే ఉంది.

ఇయర్ బడ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, వాటి ధర వింటేనే కాస్త కంగారు పుడుతుంది. కానీ, బడ్జెట్ లో ఉండే ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిలో అంత మంచి క్వాలిటీ, ఫీచర్స ఉండవు. ఇప్పుడు క్వాలిటీ ప్లస్ ఫీచర్స్ ఉన్న ఇయర్ బడ్స్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి. అది కూడా ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ తీసుకొస్తున్న సేల్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు వాటి ఫీచర్స్ ని రివీల్ చేశారు. అవి తెలుసుకున్న వినియోగదారులు కచ్చితంగా ఈ ఇయర్ బడ్స్ కొనాల్సిందే అంటూ అవుతున్నారు. పైగా అవి ఎంతో స్టైలిష్ గా కూడా ఉన్నాయి. మరి.. ఆ బడ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఇయర్ బడ్స్ మరేవో కాదు.. రెడ్ మీకి చెందిన 5సీ బడ్స్. వీటి లుక్స్ కి ఇప్పుడు అంతా ఫిదా అయిపోతున్నారు. లుక్స్ పరంగా మాత్రం బడ్స్ యాపిల్ ఎయిర్ పోడ్స్ తరహాలో ఉంటాయి. ఇంక ఫీచర్స్ చూస్తే నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఇందులో కంపెనీ ముఖ్యంగా నాయిస్ క్యాన్స్ లేషన్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ రెడ్ మీ 5సీ బడ్స్ కి ట్యాగ్ లైన్ కూడా.. నాయిస్ అవుట్- మ్యూజిక్ ఇన్ అనే ట్యాగ్ పెట్టడం విశేషం. ఇందులో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. అది ఏకంగా 40 డెసిబిల్స్ వరకు అవుట్ సైడ్ నాయిస్ ని క్యాన్సిల్ చేస్తుంది. మీకు కేవరం మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది అనమాట. అందుకే వాళ్లు ఈ బడ్స్ కి అలాంటి ట్యాగ్ ని సెలక్ట్ చేసుకున్నారు.

ఇంక ఈ 5సీ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాడ్ మైక్ ఏఐ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. షావోమీ ఇయర్ బడ్స్ యాప్ కి మీరు ఈ 5సీ బడ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి 12.4ఎంఎం టైటేనియం డ్రైవర్స్ తో వస్తున్నాయి. మీకు అద్భుతమైన మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అంతేకాకుండా వీటిలో 5 సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. స్టాండర్డ్, ఎన్ హ్యాన్స్ ట్రెబుల్, ఎన్ హ్యాన్స్ వాయిస్, ఎన్ హ్యాన్స్ బేస్, కస్టమ్ అనే 5 సౌండ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఒక్కసారి కేస్ ని ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 36 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. అలాగే సింగిల్ ఛార్జ్ తో మీరు 7 గంటల వరకు ప్లే టైమ్ ని పొందవచ్చ. మీరు కేవలం 10 నిమిషాల్లో ఛార్జ్ చేసి.. 2 గంటల ప్లే టైమ్ ని పొందవచ్చు.

ఇంకా ఈ రెడ్ మీ 5సీ ఇయర్ బడ్స్ ఐపీ 54 రేటింగ్ తో వస్తున్నాయి. అంటే మీకు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫాస్ట్ పెయిరింగ్, లో లేటెన్సిలో గేమింగ్ ఎక్స్ పీరియన్స్ వంటి ఎక్స్ ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మీరు రెండు పెయిర్స్ ఇయర్ బడ్స్ ఒకే ఫోన్ కి కనెక్ట్ చేసి మూవీస్ చూడచ్చు. అయితే సెలక్టివ్ రెడ్ మి/ షావోమీ ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. ఇంక వీటి ధర రూ.1,999గా ఉండచ్చు అని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రైమ్ డే సేల్ లో జులై 20న మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ బడ్స్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Show comments