రియల్‌మి నుంచి 5జీ గేమింగ్ స్మార్ట్ ఫోన్.. మైండ్ బ్లాక్ ఫీచర్స్.. 7 వేల డిస్కౌంట్ కూడా

realme GT 6T 5G Gaming Smartphone: మీరు గేమింగ్ లవర్సా? మంచి పెర్ఫార్మెన్స్ తో, బ్యాటరీ బ్యాకప్ తో, అద్భుతమైన కెమెరా క్వాలిటీతో మైండ్ బ్లాక్ ఫీచర్స్ తో.. ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ స్పేస్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే రియల్ మి నుంచి వచ్చిన ఈ 5జీ గేమింగ్ ఫోన్ మీ కోసమే.

realme GT 6T 5G Gaming Smartphone: మీరు గేమింగ్ లవర్సా? మంచి పెర్ఫార్మెన్స్ తో, బ్యాటరీ బ్యాకప్ తో, అద్భుతమైన కెమెరా క్వాలిటీతో మైండ్ బ్లాక్ ఫీచర్స్ తో.. ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ స్పేస్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే రియల్ మి నుంచి వచ్చిన ఈ 5జీ గేమింగ్ ఫోన్ మీ కోసమే.

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు దాదాపు అందరి దగ్గర ఉంటుంది. ఎల్కేజీ, యూకేజీ చదివే చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోతే వాళ్లకి రోజు గడవదు. ఇక యూత్ కి స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే కొంతమంది మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తే పాత ఫోన్ ని అమ్మేసి లేదా ఎవరికైనా ఇచ్చేసి కొత్త ఫోన్ ని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ అయిన స్మార్ట్ ఫోన్స్ ని కొనకుండా మాత్రం వదలరు. స్మార్ట్ ఫోన్ కొనేవారు ముందు చూసేది కెమెరా క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, గేమింగ్ పెర్ఫార్మెన్స్, ఛార్జింగ్ ఇవే చూస్తారు. ఈ విషయాల్లో రియల్ మి కస్టమర్ అభిరుచులకు తగ్గట్టు బడ్జెట్ లో ఫోన్స్ ని తయారు చేస్తుంటుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రియల్ మి కంపెనీ.. సరికొత్త గేమింగ్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఇదే ఫోన్ చైనాలో.. రియల్ మి ఎన్ఈఓ ఎస్ఈ 5జీ పేరుతో ఇటీవల లాంఛ్ అయ్యింది. ఈ మోడల్ ని కొన్ని మార్పులతో ఇక్కడ విడుదల చేశారు. 

రియల్ మి జీటీ 6టీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్:

  • స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ఫ్లాగ్ షిప్ చిప్ సెట్
  • 5500 ఎంఏహెచ్ మాసివ్ బ్యాటరీ 
  • 120 వాట్ సూపర్ వూక్ ఛార్జ్ 
  • 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్
  • 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్  
  • నానో మిర్రర్ డిజైన్, మిస్ట్ ఏజీ ప్రాసెస్ 
  • సోనీ 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా 
  • 6.78 అంగుళాల 1.5K హై రిజల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే
  • 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ హైపర్ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం రియల్ మి యూఐ 5.0
  • గూగుల్ జెమిని ఏఐ 

కాల్స్ కోసం వాడితే 37 గంటలు, చాటింగ్ కోసం 24 గంటలు, వీడియో పర్పస్ అయితే 23 గంటలు, గేమింగ్ పర్పస్ అయితే 8 గంటలు కంటిన్యూగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. ఒకటి రేజర్ గ్రీన్, మరొకటి ఫ్లూయిడ్ సిల్వర్. ఇందులో 4 వేరియంట్లు ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ. 33,999 కాగా లాంఛ్ ఆఫర్ కింద రూ. 3 వేలు, ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ కింద 4 వేలు తగ్గిస్తూ రూ. 26,999 లాంఛ్ ధరతో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ అసలు ధర రూ. 35,999 కాగా 7 వేల తగ్గింపుతో రూ. 28,999కే వస్తుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 37,999 కాగా 6 వేల తగ్గింపుతో రూ. 31,999 లాంఛ్ ధరతో వస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగిన ఫోన్ ధర రూ. 41,999 కాగా 6 వేల తగ్గింపుతో రూ. 35,999కే వస్తుంది. ఈ డిస్కౌంట్లతో పాటు అదనంగా ఎక్స్ ఛేంజ్ కింద 2 వేలు తగ్గింపు పొందవచ్చు.  

వేరియంట్లను బట్టి లాంఛింగ్ ధర:

  • 8 జీబీ + 128 జీబీ: రూ. 26,999/-
  • 8 జీబీ + 256 జీబీ: రూ. 28,999/-
  • 12 జీబీ + 256 జీబీ: రూ. 31,999/-
  • 12 జీబీ + 512 జీబీ: రూ. 35,999/-

ఎక్స్ ఛేంజ్ తో వేరియంట్ల ధరలు:

  • 8 జీబీ + 128 జీబీ: రూ. 24,999/-
  • 8 జీబీ + 256 జీబీ: రూ. 26,999/-
  • 12 జీబీ + 256 జీబీ: రూ. 29,999/-
  • 12 జీబీ + 512 జీబీ: రూ. 33,999/-

ఈ రియల్ మి జీటీ 6టీ 5జీ గేమింగ్ స్మార్ట్ ఫోన్ సేల్స్.. ప్రముఖ ఈకామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో మే 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 6 వేలు, 7 వేల డిస్కౌంట్ పొందాలంటే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఏదో ఒక కార్డు ఉండాలి. ఈఎంఐలో కొన్నా కూడా డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకూ ఈఎంఐ మీద ఎలాంటి కాస్ట్ ఉండదు. ఈ ఫోన్ చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments