అఫీషియల్: వాహనదారులకు షాకిచ్చిన OLA.. ఆ వాహనం నిలిపివేత..

OLA CEO Bhavish Aggarwal Confirmed That No EV Car: ఇండియాలో లీడింగ్ విద్యుత్ వాహన తయారీ సంస్థల్లో ఓలా కూడా ఒకటి. అయితే ఓలా ఇప్పుడు తమ వినియోగదారులకు షాకిస్తోంది. ఒక వాహనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

OLA CEO Bhavish Aggarwal Confirmed That No EV Car: ఇండియాలో లీడింగ్ విద్యుత్ వాహన తయారీ సంస్థల్లో ఓలా కూడా ఒకటి. అయితే ఓలా ఇప్పుడు తమ వినియోగదారులకు షాకిస్తోంది. ఒక వాహనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం ఇండియాలో అంతా ఎలక్ట్రిక్ వాహనాల ఎరా నడుస్తోంది అని చెప్పాలి. ఎందుకంటే టూ వీలర్ నుంచి బస్సుల వరకు అంతా విద్యుత్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈవీలైతే అటు పర్యావరణం మాత్రమే కాకుండా.. ఇటు పర్స్ కి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంక విద్యుత్ వాహనాల తయారీలో అన్నీ కంపెనీలు దూసుకుపోతున్నాయి. వాటిలో ఓలా కంపెనీ పేరు కచ్చితంగా ఉంటుంది. పంద్రాగస్టున జరిగిన ఓలా ఈవెంట్ లో కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా పరిచయం చేశారు. అయితే ఒక పాత్ ప్రాజెక్ట్ ని అటకెక్కించిన విషయాన్ని తాజాగా ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించారు.

ఓలా కంపెనీ ఇటీవల జరిగిన ఈవెంట్ లో చాలానే ప్రాజెక్టుల గురించి వినియోగదారులతో చర్చించారు. ముఖ్యంగా వారి నుంచి రాబోతున్న రోడ్ స్టర్ సిరీస్ గురించి వివరించారు. రోడ్ స్టర్ బైక్ ని లాంఛ్ చేశారు. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో వారి నుంచి రాబోతున్న బైక్స్ గురించి కూడా వివరించారు. కానీ, ఈ లిస్ట్ లో ఒక ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన చేయలేదు. అదే ఎలక్ట్రిక్ కారు గురించి. నిజానికి ఓలా మూడేళ్ల క్రితమే ఓలా కారు గురించి ప్రకటన చేసింది. 2022లో ఒక డిజైన్ ని కూడా విడుదల చేశారు. ఫుల్ గ్లాస్ టాప్ తో ఆ వర్షన్ వినియోగదారుల అటెన్షన్ గ్రాబ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈవెంట్లో దాని ప్రస్తావన లేదు. ఆ ప్రాజెక్ట్ ని ఆపేశారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. వాటిపై ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు.

ఓలా కారు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసిన విషయాన్ని భవీష్ స్వయంగా ప్రకటించారు. తమ నుంచి ఓలా ఎలక్ట్రిక్ కారు రావడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. అందుకు కారణం ఓలా కంపెనీ లాభాల మీద దృష్టి సారించడమే అంటున్నారు. అంటే ఈ నెల ప్రారంభంలో ఓలా కంపెనీ ఐపీఓ ప్రారంభించింది. అందులో భాగంగానే లాభాల మీద దృష్టి సారించడం వల్లే ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు అంటున్నారు. పక్కన పెట్టడం వరకు క్లారిటీ ఇచ్చారు. కానీ, మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయాన్ని మాత్రం భవీష్ అగర్వాల్ చెప్పలేదు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడప్పుడే ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్ట్ లేదు అనే విషయంపై స్పష్టత వచ్చింది. ఇండియాలో ఉన్న టాప్ లీడింగ్ ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఓలా తమ ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తామని చెప్పింది. దాదాపుగా 500 కిలో మీటర్ల రేంజ్ తో ఈ కారు ఉంటుంది అనుకున్నారు. మరి.. ఓలా ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టును పక్కన పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments