Tirupathi Rao
Okaya Ferrato Disruptor: మార్కెట్లో మీకు చాలానే స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. కానీ, అవి కొనుగోలు చేయాలి అంటే చాలానే ఖర్చు అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ లో ఒక అదిరిపోయే స్పోర్ట్స్ బైక్ వచ్చేసింది.
Okaya Ferrato Disruptor: మార్కెట్లో మీకు చాలానే స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. కానీ, అవి కొనుగోలు చేయాలి అంటే చాలానే ఖర్చు అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ లో ఒక అదిరిపోయే స్పోర్ట్స్ బైక్ వచ్చేసింది.
Tirupathi Rao
సాధారణంగా కుర్రకారుకు అదిరిపోయే లుక్స్, మంచి మైలేజ్, స్పోర్ట్స్ లుక్స్ లో బైకు కొనాలి అని ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే స్పోర్ట్స్ బైక్ మైలేజ్ ఇవ్వదు. మంచి మైలేజ్ కావాలి అంటే అది స్పోర్ట్స్ బైక్ ఇవ్వదు. కానీ, ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్స్ ఒకే బైక్ లోకి వస్తున్నాయి. అది కూడా బడ్జెట్ ధరలోనే. సాధారణ బైక్ కొనుగోలు చేసిన ధరలోనే మీరు ఈ స్పోర్ట్స్ లుక్స్ లో ఉన్న అదిరిపోయే బైక్ ని కొనుగోలు చేసుకోవచ్చు. పైగా ఇది చాలా తక్కువ మెయిన్టినెన్స్ తో వస్తోంది. కిలోమీటరకు మీకు కేవలం రూ.0.25 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంత తక్కువ ఎలా అని షాకవ్వకండి. ఇది ఎలక్ట్రిక్ బైక్. కానీ, స్పోర్ట్స్ బైక్ కి ఏ మాత్రం తీసిపోదు.
ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ స్పోర్ట్స్ బైక్ ఢిల్లీకి చెందిన ఒకాయా సంస్థకు చెందింది. ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో ‘డిస్ రప్టర్’ అనే సరికొత్త ఎలక్ట్రిక్ బైకును లాంఛ్ చేసింది. ఈ ఒకాయా డిస్ రప్టర్ అనేది లుక్స్ పరంగా ఏ ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కి తీసిపోదు. ముఖ్యంగా సుజుకీ జిక్సర్ ని పోలినట్లు ముందు వైపు మొత్తం భారీ భారీ డోమ్స్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఇలాంటి ఒక స్పోర్ట్స్ బైక్ రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పైగా ఈ బైక్ ధర బడ్జెట్ లో ఉండటం మరో విశేషం. ఈ బైక్ ధర రూ.1,59,999గా ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం అందించే విద్యుత్ వాహనాల రాయితీ పోను ఢిల్లీలో ఈ బైక్ కేవలం రూ.1.40 లక్షలకు అందుబాటులో ఉండనుంది. ఈ తరహా స్పోర్ట్స్ లుక్స్ లో బైక్ నార్మల్ ధర చూసుకుంటే రూ.2.5 లక్షలు ఉంటాయి. కానీ, ఇది కేవలం రూ.1.40 లక్షలకే కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. పైగా ఈ స్పోర్ట్స్ బైక్ నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. కిలో మీటరుకు కేవలం రూ.0.25 పైసలు మాత్రమే అవుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బైక్ 125 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది.
ఈ డిస్ రప్టర్ టాప్ స్పీడ్ గంటకు 95 కిలోమీటర్లు ఉండటం మరో విశేషం. ఈ డిస్ రప్టర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డిజిటల్ బైబ్రిడ్ డిస్ ప్లే, జీపీఎస్ కనెక్టవిటీ, బ్లూటూత్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రోక్స్ కూడా లభించనున్నాయి. ప్రస్తుతానికి మొదటి వెయ్యి మంది వినియోగదారులు తమ అధికారిక వెబ్ సైట్ లో కేవలం రూ.500 మాత్రమే టోకెన్ అమౌంట్ గా కట్టి ఈ డిస్ రప్టర్ స్పోర్ట్స్ బైక్ ని బుక్ చేసుకోవచ్చని ఒకాయా కంపెనీ చెప్తోంది. వెయ్యి మంది దాటిన తర్వాత ఆ ధర రూ.2,500గా ఉంటుంది. ఈ బైక్ పై మీకు మూడేళ్లు/35 వేల కిలోమీటర్ల వరకు కంపెనీ వారెంటీ లభిస్తుంది. మరి.. ఈ ఒకాయా డిస్ రప్టర్ బండిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.