20 వేలలోపు వైర్ లెస్ ఛార్జర్ తో స్మార్ట్ ఫోన్.. ఈ సెగ్మెంట్ లో ఇదే తొలిసారి!

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి ఇన్ఫినిక్స్ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. 20 వేలలోపు వైర్ లెస్ ఛార్జర్ తో స్మార్ట్ ఫోన్ అందిస్తోంది ఇన్పినిక్స్.

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి ఇన్ఫినిక్స్ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. 20 వేలలోపు వైర్ లెస్ ఛార్జర్ తో స్మార్ట్ ఫోన్ అందిస్తోంది ఇన్పినిక్స్.

ఎవరైనా సరే ఫోన్ కొనాలనుకున్నప్పుడు ముందుగా చూసే ఫీచర్లు కెమెరా క్వాలిటీ, బ్యాటరీ కెపాసిటీ, ప్రాసెసర్. కస్టమర్ల ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గకుండా మొబైల్ తయారీ కంపెనీలు కళ్లు చెదిరే ఫీచర్లతో ఒకదానిని మించి మరొకటి స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు న్యూ వర్షన్ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ టైమ్ వైర్ లెస్ ఛార్జర్ తో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇన్ఫినిక్స్. ధర కూడా 20 వేలకే ఉంది. అదిరిపోయే ఫీచర్లను పొందుపరిచారు ఈ స్మార్ట్ ఫోన్లో. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్ లో సేల్ కు సిద్ధమైంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. స్టన్నింగ్ డిజైన్.. స్పెసిఫికేషన్లతో వస్తున్న ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7020 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ వింటేజ్ గ్రీన్ మరియు టైటాన్ గోల్డ్ అనే రెండు కలర్స్ లో వస్తుంది. ఈ ఫోన్ కొనాలనుకునే కస్టమర్లు రూ. 5,000 విలువైన ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ.21,999కు లభిస్తుంది.

ఫీచర్లు:

ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో + 5జీ మరియు నోట్ 40 ప్రో 5జీ కూడా ఒకే విధమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. రెండు మోడల్స్ లో కూడా 6.78-అంగుళాల FHD+ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ 1300 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా సేఫ్ గా ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో సిరీస్ ఓఐఎస్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ కెమెరాతో అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ కెమెరాను పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 100డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. నోట్ 40 ప్రో మోడల్ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ రెండు డివైజ్‌లు 20డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, జేబీఎల్ ద్వారా ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు, ఐపీ53 రేటింగ్ వంటి మరిన్ని ఫీచర్లు అందించారు.

Show comments