Vinay Kola
Mobile Charging: చాలా మందికి కూడా ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
Mobile Charging: చాలా మందికి కూడా ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
Vinay Kola
స్మార్ట్ ఫోన్స్ వాడే చాలా మందికి కూడా బ్యాటరీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఫోన్ ఎంత చార్జ్ చేసినా కూడా త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. దాంతో ఫోన్‌ను పదేపదే ఛార్జ్ చేయాల్సి వస్తోంది. అయితే మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే దాన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు . మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోకుండా చూసుకోవచ్చు. ఛార్జింగ్ ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు బ్యాటరీ ఎక్కువ టైమ్ వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ ని వాడేవారు దాని బ్రైట్ నెస్ విషయంలో కచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకుంటే త్వరగా బ్యాటరీ డ్రెయిన్ అవుతోంది. అందుకే మీ ఫోన్ బ్రైట్నెస్ను మరీ ఎక్కువ పెంచకుండా మీకు కమ్ఫర్ట్ గా ఉండే లెవెల్ కి తగ్గించండి. ఈ సెట్టింగ్ ని మార్చడం వల్ల మీ బ్యాటరీ సేవ్ అవుతుంది. మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోదు. దీని కోసం మీరు ఆటోమెటిక్ బ్రైట్నెస్ స్మార్ట్ సెట్టింగ్ ని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఛార్జింగ్ తగ్గకుండా బాగా ఉపయోగపడుతుంది. ఈ సెట్టింగ్- మీ ఫోన్ కి తగ్గట్లు మీరు వాడుతున్న విధానాన్ని బట్టి బ్రైట్నెస్ను అడ్జస్ట్ చేస్తుంది. అలాగే మీరు ఉన్న ప్రాంతంలో ఎంత లైట్ ఉంది అనే దానికి అనుగుణంగా ఈ ఫీచర్ ఫోన్ బ్రైట్నెస్ను తగ్గిస్తుంది లేదా పెంచుతుంది. ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్సెసిబిలిటీ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత డిస్ప్లే &టెక్స్ట్ సైజ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆటో-బ్రైట్నెస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.
స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు ఎప్పుడూ కూడా ‘లొకేషన్ సర్విసెస్ సెట్టింగ్స్’ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అనవసర యాప్‌లకు లొకేషన్ యాక్సెస్ ఇస్తే బ్యాటరీ త్వరగా తగ్గిపోతుంది. అంతేగాక మీ పర్సనల్ డేటా కూడా హ్యాకింగ్ కి గురయ్యే ప్రమాదం ఉంది. నావిగేషన్, వెదర్ యాప్‌ల సెట్టింగ్స్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇవే కాకుండా కొన్న యాప్‌లు మీ లొకేషన్‌ను యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతాయి. అలాంటి వాటికి లొకేషన్ పర్మిషన్ ఇస్తే సర్విసెస్ క్వాలిటీ పెరగకపోగా, మీ పర్సనల్ డేటాను థర్డ్ స్టోర్ చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి యాప్‌లకు పర్మిషన్ ఇవ్వకూడదు. మీరు మీ ఫోన్లో లొకేషన్ సర్వీసెస్‌ను కంప్లీట్‌గా ఆపివేయొచ్చు లేదా సెట్టింగ్స్ లో చేంజ్ చేయొచ్చు. అందువల్ల కేవలం యాప్ వాడేతున్నప్పుడు మాత్రమే అవి మీ లొకేషన్ ని ఉపయోగించుకుంటాయి. దీనివల్ల మీ ఫోన్ ఛార్జింగ్ సేవ్ అవుతుంది.
అలాగే చాలా మంది కూడా అవసరం ఉన్నా లేకపోయినా కూడా మొబైల్ డేటాని ఆన్ లో ఉంచుతారు. దీనివల్ల మీకు యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దాంతో మీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. మీరు ఫోన్ ని వాడుతున్నప్పుడు మాత్రమే మీ మొబైల్ డేటాని ఆన్ లో పెట్టండి. వాడని టైమ్ లో మొబైల్ డేటాని ఆఫ్ లో పెట్టుకోండి. అలాగే అనవసరమైన థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. వీటి వల్ల యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల కూడా మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. ఇలా ఈ టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ త్వరగా తగ్గకుండా సేవ్ చేసుకోవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.