Huawei Watch GT4: అడ్వాన్స్డ్ ఫీచర్లతో హువాయ్ నుంచి న్యూ స్మార్ట్ వాచ్.. బ్యాటరీ లైఫ్‌ 14 రోజులు

అడ్వాన్స్డ్ ఫీచర్లతో హువాయ్ నుంచి న్యూ స్మార్ట్ వాచ్.. బ్యాటరీ లైఫ్‌ 14 రోజులు

Huawei Watch GT4: స్మార్ట్ వాచ్ ప్రియులకు మరో కొత్త వాచ్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఫీచర్లతో హువాయ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. 14 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.

Huawei Watch GT4: స్మార్ట్ వాచ్ ప్రియులకు మరో కొత్త వాచ్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఫీచర్లతో హువాయ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. 14 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ వాచ్ వాడడం ట్రెండీగా మారింది. అన్ని ఏజ్ గ్రూపుల వారు వాచ్ లను ధరిస్తున్నారు. లుక్ కోసం, హెల్త్ ట్రాక్ కోసం స్మార్ట్ వాచ్ లను వాడే వారి సంఖ్య పెరుగుతున్నది. యూజర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థలు స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. స్మార్ట్ వాచ్ ప్రియుల కోసం మరో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. ప్రముఖ కంపెనీ హువాయ్ స్మార్ట్ వాచ్ జీటీ4 పేరుతో సరికొత్త వాచ్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది.

హువాయ్ జీటీ-4 స్మార్ట్ వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. లాంగ్ జర్నీ చేసినప్పుడు, ట్రిప్ కు వెళ్లినప్పుడు యూజ్ ఫుల్ గా ఉంటుంది. హువాయ్ వాచ్ జీటీ-4 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. హువాయ్ జీటీ-4 వాచ్‌ ధర రూ. 14,999గా నిర్ణయించింది. హువాయ్ వాచ్ జీటీ-4 స్మార్ట్ వాచ్‌లో యాక్సిలెరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బారోమీటర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వస్తుంది. అలాగే ఇంటర్నల్ మైక్రోఫోన్, స్పీకర్‌తో వచ్చే వాచ్ 4 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ ట్రూసీన్ 5.5 ప్లస్ టెక్నాలజీతో పని చేస్తుంది. హార్ట్ రేట్, ఎస్‌పీఓ-2 స్థాయి, స్లీపింగ్ ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి 100 మంది కొనుగోలుదారులు రూ.500 చొప్పున డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Show comments