iDreamPost
android-app
ios-app

తమిళం కన్నా తెలుగులోనే క్రేజి డీల్స్

  • Published Jun 18, 2025 | 3:21 PM Updated Updated Jun 18, 2025 | 3:21 PM

తమిళ ఆడియన్స్ కు అన్ని సినిమాలలానే ఇది కూడా ఓ సినిమా. కానీ తెలుగు ఆడియన్స్ కు అలా కాదు. నాగార్జున , ధనుష్ కలయిక . శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న కొత్త కాన్సెప్ట్. పైగా తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. అందుకే తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. తెలుగు సినీ ప్రియుల గురించి తెలియనిది కాదు.. ఒక సినిమా కంటెంట్ నచ్చింది అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమాను అందలం ఎక్కించేస్తారు

  • Published Jun 18, 2025 | 3:21 PMUpdated Jun 18, 2025 | 3:21 PM
తమిళం కన్నా తెలుగులోనే క్రేజి డీల్స్

సరిగ్గా ఇంకో మూడు రోజుల్లో థియేటర్స్ లో మళ్ళీ సందడి మొదలవుతుంది. కుభేర సినిమా మీద అందరికి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక మూవీ థియేటర్స్ లో తన సత్తా చాటుకోవడమే లేట్. రీసెంట్ గా రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్ మూవీ మీద హైప్ ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అప్పుడే ట్రెండ్ లోకి వచ్చేశాయి. నిజానికి ఇది తమిళ సినిమానే అయినా తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దూకుడు చూపించడం విశేషం. ప్రముఖ నగరాల మల్టిప్లెక్స్ లో ఫస్ట్ డే షోస్ అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు.. తమిళ ఆడియన్స్ కు అన్ని సినిమాలలానే ఇది కూడా ఓ సినిమా. కానీ తెలుగు ఆడియన్స్ కు అలా కాదు. నాగార్జున , ధనుష్ కలయిక . శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న కొత్త కాన్సెప్ట్. పైగా తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. అందుకే తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. తెలుగు సినీ ప్రియుల గురించి తెలియనిది కాదు.. ఒక సినిమా కంటెంట్ నచ్చింది అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమాను అందలం ఎక్కించేస్తారు. సో ఇప్పుడు కుభేరకు కూడా అదే స్థానం దక్కుతుందని అంతా అనుకుంటున్నారు.

గతంలో సార్ సినిమాకు కూడా ఇదే రకమైన రెస్పాన్స్ దక్కింది. అక్కడ కేవలం హిట్ అనిపించుకున్న సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కుభేరకు కూడా టాక్ బాగా వస్తే రెండు మూడు వారాలు థియేటర్ లో స్ట్రాంగ్ గా నిలిచే అవకాశం ఉంది. జూన్ 27న కన్నప్ప , జులై 4 న తమ్ముడు రిలీజ్ లు ఉన్నాయి. ఈలోపే రాబట్టాల్సినవి రాబట్టి.. యునానిమస్ గా హిట్ అనిపించుకుంటే కుభేర సేఫ్ జోన్ కు చేరినట్టే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.