iDreamPost
android-app
ios-app

SSMB 29 నుంచి కీలక అప్డేట్.. ఈసారి వారణాసిలో కథ

  • Published Jun 19, 2025 | 12:46 PM Updated Updated Jun 19, 2025 | 12:46 PM

ట్రెజర్ హంట్ బ్యాక్డ్రాప్ లో రూపొందే ఈ మూవీలో మహేష్ బాబు ఓ వేటగాడిగా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్. అడవికి వెళ్ళడానికి ముందు ఓ రహస్యాన్ని ఛేదించడానికి సంబందించిన ట్విస్ట్ లు .. వారణాసిలోనే జరుగుతాయని.. ఇక్కడ చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు వారణాసిలోనే జరుగుతాయని అంటున్నారు.

ట్రెజర్ హంట్ బ్యాక్డ్రాప్ లో రూపొందే ఈ మూవీలో మహేష్ బాబు ఓ వేటగాడిగా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్. అడవికి వెళ్ళడానికి ముందు ఓ రహస్యాన్ని ఛేదించడానికి సంబందించిన ట్విస్ట్ లు .. వారణాసిలోనే జరుగుతాయని.. ఇక్కడ చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు వారణాసిలోనే జరుగుతాయని అంటున్నారు.

  • Published Jun 19, 2025 | 12:46 PMUpdated Jun 19, 2025 | 12:46 PM
SSMB 29 నుంచి కీలక అప్డేట్.. ఈసారి వారణాసిలో కథ

ప్రపంచ వ్యాప్తంగా అందరికి అంచనాలు పెంచేస్తున్న మూవీ SSMB29. ఈ మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా సరే లీకులు మాత్రం వచ్చేస్తున్నాయి. మూవీ షూటింగ్ పనులు కీలక దశకు చేరుకుంటున్నాయట. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో 50 కోట్లతో వారణాసి సెట్ వేసారట. ఈ సెట్ లో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ను షూట్ చేయనున్నారట మేకర్స్. ట్రెజర్ హంట్ బ్యాక్డ్రాప్ లో రూపొందే ఈ మూవీలో మహేష్ బాబు ఓ వేటగాడిగా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్.

అడవికి వెళ్ళడానికి ముందు ఓ రహస్యాన్ని ఛేదించడానికి సంబందించిన ట్విస్ట్ లు .. వారణాసిలోనే జరుగుతాయని.. ఇక్కడ చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు వారణాసిలోనే జరుగుతాయని అంటున్నారు. నిజానికి ఒరిజినల్ గా అక్కడే షూట్ చేద్దామని అనుకున్నారట కానీ అక్కడ రద్దీని దృష్టిలో ఉంచుకుని అనుకున్న టైం కి షూట్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో.. ఇక్కడ ఆ సెట్ వేయించారట. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఈ రేంజ్ గ్రాండియర్ సెట్ వేయలేదట. ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలకు సైతం వేసిన సెట్స్ కు పాతిక కోట్ల లోపే ఖర్చయ్యిందట. కానీ ఈ సినిమాకు మాత్రం భారీ రేంజ్ లో ఖర్చుపెడుతున్నారట.

ఈ సెట్ నుంచి దగ్గర నుంచి చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారట. బాహుబలి రామోజీ ఫిలిం సిటీలో ఎలా ప్రత్యేకంగా నిలిచిపోయిందో ఇప్పుడు ఈ వారణాసి సెట్ కూడా అలానే నిలిచిపోతుందని అంటున్నారు. సో జక్కన్న ఈసారి ఇంకాస్త గొప్పగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. ఎవరు టచ్ చేయని ఇండస్ట్రీ రికార్డ్స్ ను సెట్ చేయడం ఖాయం. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş