iDreamPost
android-app
ios-app

ఏ మాయ చేసావే… రైట్ టైం లో వస్తుందిగా

  • Published Jun 19, 2025 | 11:44 AM Updated Updated Jun 19, 2025 | 11:44 AM

నాగచైతన్య , సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ కు ఏ మాయ చేసావే చాలా స్పెషల్. అదేంటో తెలియదు కానీ ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ప్రతి పాట ప్రతి ఒక్కరి మదిలో ఎప్పటికి ఓ స్వీట్ మెమరిలా ఉండిపోతుందని చెప్పొచ్చు. అప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది

నాగచైతన్య , సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ కు ఏ మాయ చేసావే చాలా స్పెషల్. అదేంటో తెలియదు కానీ ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ప్రతి పాట ప్రతి ఒక్కరి మదిలో ఎప్పటికి ఓ స్వీట్ మెమరిలా ఉండిపోతుందని చెప్పొచ్చు. అప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది

  • Published Jun 19, 2025 | 11:44 AMUpdated Jun 19, 2025 | 11:44 AM
ఏ మాయ చేసావే… రైట్ టైం లో వస్తుందిగా

నాగచైతన్య , సమంత మ్యూచువల్ ఫ్యాన్స్ కు ఏ మాయ చేసావే చాలా స్పెషల్. అదేంటో తెలియదు కానీ ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ప్రతి పాట ప్రతి ఒక్కరి మదిలో ఎప్పటికి ఓ స్వీట్ మెమరిలా ఉండిపోతుందని చెప్పొచ్చు. అప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కల్లో ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. అప్పట్లో రికార్డులైతే బద్దలుకొట్టలేదు కానీ యువత హృదయాలను కొల్లగొట్టింది. కానీ ఇప్పుడు రీరిలీజ్ అప్పుడు మాత్రం యువత హృదయాలతో పాటు రికార్డ్స్ కూడా బద్దలు కొట్టడం ఖాయం. ఎందుకంటే ఆ రేంజ్ లో ఈ రీరిలీజ్ లను సెలెబ్రేట్ చేస్తున్నారు ఆడియన్స్.

తమ అభిమాన హీరో సినిమానే కాదు.. ఏ హీరో సినిమా వచ్చినా సరే సెలెబ్రేషన్స్ అదే రేంజ్ లో ఉండడం విశేషం. తెలుగు ఆడియన్స్ కు సినిమాలంటే ఎంత అభిమానమో ప్రతి సారి బయటపడుతూనే ఉంది. సో కచ్చితంగా ఏ మాయ చేసావే సినిమాను కూడా ఇదే రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా మూవీలో సాంగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. థియేటర్ లో మరో మ్యూజికల్ కాన్సర్ట్ కన్ఫర్మ్. అసలు ఈ సినిమాను మరోసారి తెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా కూడా సరిగ్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్ టైం కు ఎంట్రీ ఇస్తుంది. దీనిని జూలై 18న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఆ సమయంలో ఎలాంటి కొత్త రిలీజ్ లు లేవు. హరి హర వీరమల్లు జులై 24, కింగ్డమ్ జులై 25 అని అంటున్నారు. దీనికి ముందు అనుష్క ఘాటీ ఉంది. సో దీనికి ఎలాంటి రిస్క్ లేదు. కొత్త రిలీజులు వచ్చేలోపు ఎంత రాబట్టలో అంత రాబట్టొచ్చు. ఇక సామ్ ఈ మూవీ రిరీలీజ్ ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం లేదని తేల్చి చెప్పేసింది. చైతు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. సో గౌతమ్ మీనన్, రెహమాన్ లతో ఏదైనా ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసే ఆలోచనలో టీమ్ ఉందట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler