P Venkatesh
మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే లైసెన్స్ తో పనిలేకుండా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను డ్రైవ్ చేయొచ్చు. ధర కూడా తక్కువే.
మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే లైసెన్స్ తో పనిలేకుండా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను డ్రైవ్ చేయొచ్చు. ధర కూడా తక్కువే.
P Venkatesh
ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. వాహనదారులు పెట్రోల్ తో నడిచే వాహనాల కంటే విద్యుత్ వాహనాల కొనుగోలుకే ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో స్టన్నింగ్ లుక్స్ తో టూవీలర్స్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈవీల ధరలు కూడా తక్కువగానే ఉండడంతో సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ సంస్థలు ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ అయ్యింది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఒడిస్సే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేసింది.
ఇటీవలి కాలంలో మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు తరచుగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మార్కెట్ లో తమ సత్తాచాటేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. డిజైన్, స్పీడ్, బ్యాటరీ సామార్థ్యం వంటి అంశాల్లో దేనికదే ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ క్రమంలో ఒడిస్సే కంపెనీ రెండు మోడళ్లను లాంచ్ చేసింది. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి స్నాప్, మరొకటి ఈ2 . ఈ రెండింటిలో స్నాప్ కాస్త స్పీడ్ ఎక్కువ. ఈ2 మాత్రం తక్కువ స్పీడును కలిగి ఉంది. ఇవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణానికి అనుకూలం.
ఒడిస్సే స్నాప్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 2వేల వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 60 కీ.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 105 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. స్నాప్ వాటర్ రెసిస్టెంట్ కలిగిన ఐపీ67 రేటెడ్ మోటార్, ఏఐఎస్ 156 సర్టిఫైడ్ ఎల్ఎఫ్ పీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒడిస్సే స్నాప్ హైస్పీడ్ స్కూటర్ లో లేటెస్ట్ టెక్నాలజీతో సీఏఎన్ డిస్ ప్లే ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇక ఒడిస్సే ఈ2 తక్కువ స్పీడ్ స్కూటర్. ఇది గంటకు 25కీ.మీల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. కాబట్టి దీనిని నడిపేందుకు లైసెన్స్ అవసరం లేదు. సింగిల్ ఛార్జింగ్ పెడితే 70 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కొత్త ఒడిస్సీ స్పాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 79,999గా కంపెనీ వెల్లడించింది. ఈ2 స్కూటర్ దర రూ. 69,999 గా ఉంది.