Block Adult Content On X: ఎక్స్‌లో అడల్ట్ వీడియోలు, ఫోటోలు.. ఎప్పటికీ కనిపించకూడదంటే ఇలా చేయండి!

Block Adult Content On X: ఎక్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫీడ్ లోకి అడల్ట్ కంటెంట్ ఎక్కువగా వస్తుందా? అడల్ట్ వీడియోలు, బో*ల్డ్ ఫోటోలు వస్తున్నాయా? వాటిని చూడడం మీకు ఇష్టం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ఎప్పటికీ కనిపించకుండా చేసుకోవచ్చు.

Block Adult Content On X: ఎక్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫీడ్ లోకి అడల్ట్ కంటెంట్ ఎక్కువగా వస్తుందా? అడల్ట్ వీడియోలు, బో*ల్డ్ ఫోటోలు వస్తున్నాయా? వాటిని చూడడం మీకు ఇష్టం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ఎప్పటికీ కనిపించకుండా చేసుకోవచ్చు.

ఈ నెలలో సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ కంటెంట్ మోడరేషన్ రూల్స్ ని అప్డేట్ చేసింది. అడల్ట్, గ్రాఫిక్ కంటెంట్ కి ఎంగేజ్మెంట్ పెంచుకునేందుకు అధికారికంగా ఆమోదించింది. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఈ అడల్ట్ కంటెంట్ ని చూడలేరని ఎక్స్ కంపెనీ తెలిపింది. సెన్సిటివ్ కంటెంట్ అనే లేబుల్ తో కనిపించే అడల్ట్ కంటెంట్ ఏదీ మైనర్లు చూడలేరని తెలిపింది. అయితే 18 ఏళ్లు పైబడిన చాలా మంది యూజర్లకు అడల్ట్ కంటెంట్ అనేది ఎక్స్ ప్లాట్ ఫార్మ్ లో సర్వ సాధారణమైపోయింది. దీంతో చాలా మంది ఎక్స్ యూజర్లు దీని మీద రిపోర్ట్ చేశారు. అయితే మీరు ఇలాంటి అడల్ట్ కంటెంట్ ని మీ ఎక్స్ ఫీడ్ లోకి రాకుండా ఆపుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ లో కూడా బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఉంది.

అడల్ట్ కంటెంట్ (సెన్సిటివ్ మీడియాని) ఇలా బ్లాక్ చేయండి:

  • మీ ఫోన్ లో ఎక్స్ యాప్ ఓపెన్ చేసి.. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.
    ప్రొఫైల్ లో సెట్టింగ్స్ అండ్ సపోర్ట్ కింద సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద ట్యాప్ చేయండి.
    అందులో ప్రైవసీ అండ్ సేఫిటీ మీద క్లిక్ చేయండి.
    కంటెంట్ యూ యూజ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేసి ‘సెన్సిటివ్ మీడియా’పై ట్యాప్ చేయండి.
    అడల్ట్ కంటెంట్ (వార్న్) మీద ట్యాప్ చేయండి.
    అడల్ట్ కంటెంట్ పేరుతో వార్న్, షో ఆల్, నెవర్ షోస్ దిస్ అనే మూడు ఆప్షన్స్ కనబడతాయి.
    అందులో నెవర్ షోస్ దిస్ మీద ట్యాప్ చేయండి.

కొన్ని అభ్యంతరకర పదాలను బ్లాక్ చేయండిలా:

అయితే అడల్ట్ కంటెంట్ అన్నీ సెన్సిటివ్ మీడియా కిందకు రావు. అలాంటి వాటిని మీరు బ్లాక్ చేయాలంటే పా*ర్న్ వంటి పదాలను మ్యూట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి పదాలను మ్యూట్ చేస్తే కనుక ఎక్స్ ఫీడ్ లో మీకు ఇలాంటి పోస్టులు కనిపించవు.

  • దీని కోసం మీరు ప్రైవసీ అండ్ సేఫిటీ ఆప్షన్ లోకి వెళ్ళండి.
  • అందులో మ్యూట్ అండ్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మ్యూటెడ్ వర్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది.
  • దాని మీద ట్యాప్ చేసి గాట్ ఇట్ మీద ట్యాప్ చేస్తే కుడి వైపున కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది.
  • దాని మీద ట్యాప్ చేసి సె*క్స్, బో*ల్డ్, హాట్, అడల్ట్ కంటెంట్, పా*ర్న్ ఇలా అభ్యంతరకర పదాలను ఎంటర్ చేస్తే అటువంటి కంటెంట్ మీ ఎక్స్ ఫీడ్ లోకి రాదు.
  • అంతేకాదు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వి, ట్రేడింగ్ సంబంధించినవి వంటివి కూడా మీకు కనబడకూడదనుకుంటే ఆ పదాలను మ్యూటెడ్ వర్డ్స్ లో చేర్చవచ్చు.

మరో రెండు ఆప్షన్స్:

ఎక్స్ లో కొత్త ఖాతా ఓపెన్ చేసినప్పుడు మీ పుట్టిన తేదీని నమోదు చేయకండి లేదా 18 కంటే తక్కువ వయసుని ఎంటర్ చేయండి. దీని వల్ల ఎక్స్ ఫీడ్ లో మీకు అశ్లీల కంటెంట్ కనిపించదు. మీ పుట్టిన తేదీ నమోదు చేయకపోవడం వల్ల మీరు మైనర్స్ గా పరిగణించబడతారు.

అయితే మీరు ఈ పదాలను 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వరకూ కనిపించకుండా కూడా చేసుకోవచ్చు. మీకు వద్దనుకున్నప్పుడు బ్లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడాలంటే మ్యుటెడ్ పదాలను తొలగించుకోవచ్చు. అడల్ట్ కంటెంట్ అయినా, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ వంటి వాటినైనా బ్లాక్ చేయచ్చు. ఆ బ్లాక్ ని తొలగించుకోవచ్చు.

Show comments