iDreamPost
android-app
ios-app

విలియమ్సన్, విరాట్, రూట్, బాబర్ కాదు.. అందరికంటే రోహితే గొప్ప: మాజీ క్రికెటర్

  • Author singhj Updated - 05:45 PM, Tue - 14 November 23

ప్రస్తుత క్రికెట్​లో గ్రేట్ బ్యాటర్స్ ఎవరంటే అందరూ కోహ్లీ, విలియమ్సన్, రూట్, బాబర్ పేరు చెబుతారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రం రోహిత్​ శర్మ తర్వాతే ఎవరైనా అని అంటున్నాడు. హిట్​మ్యాన్​ను మించినోడు లేడని ప్రశంసిస్తున్నాడు.

ప్రస్తుత క్రికెట్​లో గ్రేట్ బ్యాటర్స్ ఎవరంటే అందరూ కోహ్లీ, విలియమ్సన్, రూట్, బాబర్ పేరు చెబుతారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రం రోహిత్​ శర్మ తర్వాతే ఎవరైనా అని అంటున్నాడు. హిట్​మ్యాన్​ను మించినోడు లేడని ప్రశంసిస్తున్నాడు.

  • Author singhj Updated - 05:45 PM, Tue - 14 November 23
విలియమ్సన్, విరాట్, రూట్, బాబర్ కాదు.. అందరికంటే రోహితే గొప్ప: మాజీ క్రికెటర్

వరల్డ్ కప్​లో టీమిండియా జైత్రయాత్ర అలాగే కంటిన్యూ అవుతోంది. వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న భారత్.. ఆఖరి లీగ్ మ్యాచ్​లో నెదర్లాండ్స్​నూ చిత్తు చేసింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగింది రోహిత్ సేన.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు ఏకంగా 410 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థుల ముందు ఉంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (61)తో పాటు మరో ఓపెనర్ శుబ్​మన్ గిల్ (51), సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) శతకాలతో మోత మోగించారు. అసాధ్యమైన టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన డచ్ టీమ్ 47.5 ఓవర్లలో 250 రన్స్​కే కుప్పకూలింది.

జస్​ప్రీత్ బుమ్రా (2 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (2 వికెట్లు), రవీంద్ర జడేజా (2 వికెట్లు), కుల్​దీప్ యాదవ్ (2 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టారు. వీళ్లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒక్కో వికెట్ తీసి మంచి సహకారం అందించారు. సీనియర్లు విరాట్, రోహిత్​తో పాటు ఈ మ్యాచ్​లో యంగ్​స్టర్ శుబ్​మన్ గిల్, హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్​ కూడా బౌలింగ్ చేయడం విశేషం. నాకౌట్ మ్యాచ్​లో అవసరం వస్తే కొన్ని ఓవర్లు వేసేందుకు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో అందరితో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు రోహిత్. అతడి ప్లాన్ కొంతమేర సక్సెస్ అయింది. విరాట్​తో పాటు హిట్​మ్యాన్​కు కూడా ఒక వికెట్ దక్కింది. సూర్య వికెట్ తీయకపోయినా తన యాక్షన్​తో అందర్నీ ఆకట్టుకున్నాడు. డచ్ టీమ్ బ్యాటర్లను రోహిత్, కోహ్లీ ఔట్ చేసినప్పుడు స్టేడియంలోని భారత ఫ్యాన్స్ అందరూ సంతోషంలో మునిగిపోయారు. అభిమానులు ఈలలు వేస్తూ రోహిత్, కోహ్లీని ఎంకరేజ్ చేశారు.

ఇక, ఈ వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ బ్యాట్​తో రాణిస్తూనే కెప్టెన్​గానూ టీమ్​ను ముందుండి నడిపిస్తున్నాడు. మెగా టోర్నీలో సూపర్ ఫామ్​లో ఉన్న హిట్​మ్యాన్ 9 మ్యాచుల్లో కలిపి 503 రన్స్ చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 121.49గా ఉంది. టాప్-10 రన్ స్కోరర్స్​లో అతడి స్ట్రైక్ రేటే అందరికంటే ఎక్కువ కావడం విశేషం. దీన్ని బట్టే ఈ వరల్డ్ కప్​లో ​ప్రత్యర్థి బౌలర్లపై భారత కెప్టెన్ డామినేషన్ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో భారత్​కు మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. రోహిత్ అలా ఆడుతున్నాడు కాబట్టే తర్వాత క్రీజులోకి వచ్చే కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మీద ప్రెజర్ తగ్గుతోంది.

ఫీల్డింగ్ టైమ్​లోనూ సరైన ఫీల్డ్ ప్లేస్​మెంట్స్ పెడుతూ, బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ, బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు రోహిత్. అందుకే అతడ్ని మించినోడు లేడని పాకిస్థాన్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ అన్నాడు. ‘రోహిత్ శర్మ లాంటోడు మరొకడు లేడు. ఎప్పుడూ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ ఆజం గురించే అందరూ మాట్లాడతారు. కానీ హిట్​మ్యాన్ వీళ్లందరి కంటే ఎంతో డిఫరెంట్. అతడు ఆడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఏదైనా, ఎలాంటి బౌలింగ్ అటాక్ ఉన్నా అతడు తన షాట్స్ సులువుగా ఆడేస్తాడు. రోహిత్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ బాల్ నుంచే ప్రత్యర్థి బౌలర్లు బ్యాక్ ఫుట్​లోకి వెళ్లిపోతారు’ అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. మరి.. రోహిత్​ను మెచ్చుకుంటూ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సచిన్ బ్యాటింగ్ రికార్డుల గురించే మాట్లాడతారు.. అతడి బౌలింగ్ ఎంత గొప్పో తెలుసా?