iDreamPost

సచిన్ బ్యాటింగ్ రికార్డుల గురించే మాట్లాడతారు.. అతడి బౌలింగ్ ఎంత గొప్పో తెలుసా?

  • Author singhj Updated - 05:48 PM, Mon - 13 November 23

సచిన్ టెండూల్కర్ పేరు వినగానే అందరికీ అతడి బ్యాటింగ్ రికార్డులే గుర్తుకొస్తాయి. అయితే బౌలింగ్​లోనూ ఎన్నో మ్యాజికల్‌ స్పెల్స్​తో భారత్​ను గెలిపించాడు మాస్టర్ బ్లాస్టర్.

సచిన్ టెండూల్కర్ పేరు వినగానే అందరికీ అతడి బ్యాటింగ్ రికార్డులే గుర్తుకొస్తాయి. అయితే బౌలింగ్​లోనూ ఎన్నో మ్యాజికల్‌ స్పెల్స్​తో భారత్​ను గెలిపించాడు మాస్టర్ బ్లాస్టర్.

  • Author singhj Updated - 05:48 PM, Mon - 13 November 23
సచిన్ బ్యాటింగ్ రికార్డుల గురించే మాట్లాడతారు.. అతడి బౌలింగ్ ఎంత గొప్పో తెలుసా?

ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023లో మరో విక్టరీతో టీమిండియా లీగ్ దశను సక్సెస్​ఫుల్​గా ముగించింది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిదికి 9 మ్యాచుల్లోనూ నెగ్గి సెమీస్​కు దర్జాగా దూసుకెళ్లింది. నెదర్లాండ్స్​తో ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్​లో భారత్ 160 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన రోహిత్ సేన 50 ఓవర్లలో ఏకంగా 410 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన డచ్ టీమ్ 47.5 ఓవర్లలో 250 రన్స్​కు ఆలౌట్ అయింది. లీగ్ దశ పూర్తవడంతో న్యూజిలాండ్​తో సెమీస్​ మ్యాచ్​పై భారత్ ఫోకస్ చేస్తోంది. నాకౌట్ మ్యాచ్​లో గెలిచి ఫైనల్ బెర్త్​ను సంపాదించాలని చూస్తోంది.

డచ్ టీమ్​తో మ్యాచ్​లో భారత్ తరఫున ఏకంగా 9 మంది ప్లేయర్లు బౌలింగ్ వేశారు. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, కీపర్ కేఎల్ రాహుల్ తప్ప మిగతావాళ్లందరూ బౌలింగ్ వేయడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్, విరాట్ కోహ్లీలు ఒక్కో వికెట్ కూడా తీశారు. టీమ్​లో ఐదుగురు మెయిన్ బౌలర్లే ఉన్నందున అవసరమైతే నాకౌట్ మ్యాచ్​లో ఒకరిద్దరితో కొన్ని ఓవర్లు వేయించే ప్లాన్​తోనే ఈ ప్రయోగం చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది కాస్త ముందే చేయాల్సిందని.. అప్పుడే పార్ట్ టైమర్లకు కూడా మంచి ప్రాక్టీస్ దొరికేదని అంటున్నారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీలా మంచి పార్ట్ టైమ్ బౌలర్లని తయారు చేసుకోవడంపై టీమ్ మేనేజ్​మెంట్ ముందే ప్లాన్ చేసుకోవాల్సిందని చెబుతున్నారు.

గత రెండు దశాబ్దాల కాలంలో చూసుకుంటే.. భారత్ తరఫున పార్ట్ టైమర్​గా వచ్చి అద్భుతంగా బౌలింగ్ వేసినవారిలో సచిన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మాస్టర్ బ్లాస్టర్ అంటే అందరూ బ్యాటింగ్​ గొప్పదనం గురించే మాట్లాడుకుంటారు. కానీ సచిన్ బౌలింగ్​లో కూడా గ్రేట్ అనే విషయం చాలా మందికి తెలియదు. టెస్టుల్లో 46 వికెట్లు తీసిన మాస్టర్ బ్లాస్టర్, టీ20ల్లో ఒక మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. వన్డేల్లో అతడికి సూపర్బ్ రికార్డు ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్​లో ఏకంగా 154 వికెట్లు తీశాడు సచిన్. రెండు సార్లు 5 వికెట్లు తీసిన బ్యాటింగ్ గ్రేట్​కు వన్డేల్లో బౌలింగ్ యావరేజ్ 5.1గా ఉంది. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మిడిల్ ఓవర్లలో లెగ్ బ్రేక్స్​తో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేవాడు సచిన్.

వికెట్లు పడనప్పుడు లేదా మెయిన్ బౌలర్లు అలసిపోయినప్పుడు టెండూల్కర్​ చేతికి బాల్ ఇచ్చేవాడు సౌరవ్ గంగూలీ. అతడి కెప్టెన్సీలోనే మాస్టర్ ఎక్కువ మ్యాచుల్లో బౌలింగ్ చేశాడు. దాదా నమ్మకాన్ని సచిన్ వమ్ము చేయలేదు. భారత్ కష్టాల్లో ఉన్న చాలా సందర్భాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. 50 ఓవర్ల ఫార్మాట్​లో ఏ బౌలర్​కు లేని ఓ అరుదైన ఘనత సచిన్ పేరిట ఉంది. వన్డేల్లో టార్గెట్​ను డిఫెండ్ చేస్తూ ఆఖరి ఓవర్​లో 6 లేదా అంతకంటే తక్కువ పరుగుల్ని రెండుసార్లు కాపాడిన బౌలర్​గా టెండూల్కర్​ నిలిచాడు. అతడి రికార్డును మరే బౌలర్​ కూడా కొట్టలేదు. మరి.. సచిన్ అరుదైన ఘనతపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ విషయంలో రోహిత్​ శర్మను అధిగమించిన విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ఇద్దరే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి