iDreamPost
android-app
ios-app

గిల్​ బ్యాటింగ్​ చూసి సంతోషంలో మునిగిపోయిన పేరెంట్స్.. కెప్టెన్ రోహిత్ కూడా..!

  • Author singhj Published - 05:01 PM, Wed - 15 November 23

న్యూజిలాండ్​తో జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్​ మ్యాచ్​లో యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఆడిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన బ్యాటింగ్​తో పేరెంట్స్​తో పాటు కెప్టెన్‌ రోహిత్​ శర్మను కూడా ఇంప్రెస్ చేశాడు గిల్.

న్యూజిలాండ్​తో జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్​ మ్యాచ్​లో యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఆడిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన బ్యాటింగ్​తో పేరెంట్స్​తో పాటు కెప్టెన్‌ రోహిత్​ శర్మను కూడా ఇంప్రెస్ చేశాడు గిల్.

  • Author singhj Published - 05:01 PM, Wed - 15 November 23
గిల్​ బ్యాటింగ్​ చూసి సంతోషంలో మునిగిపోయిన పేరెంట్స్.. కెప్టెన్ రోహిత్ కూడా..!

వన్డే వరల్డ్ కప్-2023 సెమీఫైనల్​లో టీమిండియా అదరగొడుతోంది. టాన్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన భారత్ పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (29 బంతుల్లో 47), శుబ్​మన్ గిల్ (65 బంతుల్లో 79) అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఆరంభ ఓవర్లలో హిట్​మ్యాన్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో అలరించిన రోహిత్ ఇన్నింగ్స్​లో 4 బౌండరీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీన్ని బట్టే కివీస్ బౌలర్లను అతను ఎలా ఉతికేశాడో అర్థం చేసుకోవచ్చు. గిల్-రోహిత్ దూకుడుతో 8 ఓవర్లకే భారత్ 70 రన్స్ చేసింది. అయితే న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన స్లో డెలివరీకి హిట్​మ్యాన్ ఔటయ్యాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన భారత కెప్టెన్ సిక్స్​గా మలచబోయి గాల్లోకి లేపాడు. రోహిత్ ఇచ్చిన క్యాచ్​ను కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అద్భుతంగా పట్టుకున్నాడు.

రోహిత్ శర్మను ఔట్ చేసినా స్కోరు బోర్డు ఏమాత్రం ఆగలేదు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (80 నాటౌట్)తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు గిల్. భారీ షాట్లు కొడుతూ కివీస్ బౌలర్లను టెన్షన్​కు గురిచేశాడు. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఈ యంగ్ ఓపెనర్ 79 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. తీవ్ర ఉక్కపోత వల్ల క్రాంప్స్ రావడంతో గిల్ బ్యాటింగ్​ చేయలేకపోయాడు. రాంగ్ షాట్ ఆడి ఔట్ అవుతాడేమోననే ఉద్దేశంతో శుబ్​మన్​ను వెనక్కి వచ్చేయాలని పిలిచాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ట్రీట్​మెంట్​తో పాటు రెస్ట్ తీసుకునేందుకు డ్రెస్సింగ్ రూమ్​లోకి వెళ్లాడు గిల్. దీంతో బ్యాటింగ్​కు దిగాడు శ్రేయస్ అయ్యార్. శుబ్​మన్ వెనుదిరగడంతో అయ్యర్ (38 నాటౌట్) అండతో కోహ్లీ ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు.

ప్రస్తుతానికి భారత్ స్కోరు 34 ఓవర్లలో వికెట్ నష్టానికి ఓవర్లలో 248గా ఉంది. అయితే ఈ మ్యాచ్​లో ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ అందించిన ఓపెనింగ్ పార్ట్​నర్​షిప్ హైలైట్ అనే చెప్పాలి. బౌల్ట్​తో పాటు సౌథీపై అటాకింగ్​కు దిగాడు హిట్​మ్యాన్. తొలి ఓవర్లోనే 10 పరుగులు రావడంతో భారత బ్యాటింగ్ ఎలా ఉండబోతోందో ముందే హింట్ ఇచ్చాడు రోహిత్. ఆ తర్వాత కూడా అదే విధంగా అగ్రెసివ్ బ్యాటింగ్​ను కంటిన్యూ చేశాడు. హిట్​మ్యాన్​తో పాటు గిల్, కోహ్లీ, అయ్యర్ కూడా ఇదే విధంగా ఆడారు. గిల్ అయితే బౌండరీలు, సిక్సులతో కివీస్​ను భయపెట్టించాడు. శుబ్​మన్ బ్యాటింగ్ చూసి అతడి పేరెంట్స్​తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంప్రెస్ అయిపోయాడు. గిల్ సిక్స్​కు హిట్​మ్యాన్ లేచి డ్రెస్సింగ్ రూమ్​లో నుంచి బయటకు వచ్చి మరీ చప్పట్లు కొట్టాడు. మరి.. కీలకమైన సెమీస్​లో యంగ్ బ్యాటర్ గిల్ ఆడిన తీరు మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన గిల్.. ఎందుకంటే?