న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటానన్నాడు. హిట్‌మ్యాన్ అసలు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటానన్నాడు. హిట్‌మ్యాన్ అసలు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని వారాలుగా క్రికెట్ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరిస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 ఆఖరి దశకు చేరుకుంది. భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా నడుమ నాకౌట్ పోరు జరగనుంది. సెమీస్‌లో గెలిచే టీమ్స్ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కప్పు కోసం తుదిపోరులో తలపడతాయి. ఫస్ట్ సెమీఫైనల్లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్‌ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఎందరో హీరోలుగా నిలిచారు. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరు బాగా ఆడి టీమ్‌ను విజేతగా నిలుపుతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్‌కు అద్భుతమైన స్టార్టింగ్ ఇస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. అతడు ఎప్పటిలాగే మంచి స్టార్ట్ ఇస్తే భారత్‌కు తిరుగుండదనే చెప్పాలి.
మెగా టోర్నీలో 500 పరుగుల మార్కును దాటేసిన రోహిత్ శర్మ.. బౌలర్లు, ఫీల్డర్లకు విలువైన సూచనలు ఇస్తున్నాడు. కరెక్ట్ టైమ్‌లో డేరింగ్ డెసిజన్స్ తీసుకుంటూ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు హిట్‌మ్యాన్. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో కలసి అతడు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు కాబట్టే ఆ తర్వాత వస్తున్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒకవేళ కింగ్ కోహ్లీ ఔటైనా ఆఖరి వరకు నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు రోహిత్. ఈ వరల్డ్ కప్‌లో పలుమార్లు సెంచరీ చేసే ఛాన్స్ వచ్చినా టీమ్ కోసం వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు హిట్‌మ్యాన్. స్వార్థం చూసుకోకుండా జట్టు కోసం ఆడుతూ కెప్టెన్ అంటే ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. అలాంటి రోహిత్ నాకౌట్ మ్యాచ్‌కు ముందు తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటానన్నాడు.
‘నాకు ఓ ఫ్యామిలీ ఉంది. క్రికెట్‌తో పాటు నా కుటుంబం గురించీ ఆలోచిస్తుంటా. ఇది చాలా మంచి విషయమని అనుకుంటున్నా. హోటల్ రూమ్‌లో ఉన్నప్పుడు నేను క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటా. నా ఫ్యామిలీతో కలసి వేరే విషయాలు డిస్కస్ చేస్తా. క్రికెట్ గురించి ఆలోచించడంలో తప్పు లేదు. నేను గేమ్ గురించి ఆలోచిస్తుంటా. కానీ టైమ్ దొరికినప్పుడు మాత్రం క్రికెట్ గురించి ఆలోచించకూడదు. ఆట గురించి ఆలోచించకుండా ఉండేందుకు సమయం దొరికితే అదే పని చేయాలి. ఎందుకంటే.. మీరు రోజు మొత్తం క్రికెట్ గురించి ఆలోచించినా జరిగేదేమీ లేదు. కాబట్టి ఆ టైమ్‌లో ఇతర విషయాల వైపు ఫోకస్ చేయడం బెటర్’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఎక్కువ ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని.. అందుకే అప్పుడప్పుడు ఆలోచించకపోవడమే మంచిదన్నాడు హిట్‌మ్యాన్. మరి.. ఖాళీ టైమ్‌లో క్రికెట్‌కు దూరంగా ఉంటానంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: VIDEO: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సచిన్ కుమార్తె.. కన్ఫర్మ్ చేసిన క్రికెటర్!
Ahead of the semi-final, Rohit Sharma said having his family with him during this World Cup has allowed him to take his mind off cricket whenever possible https://t.co/lL6uUAgWRI #INDvNZ #CWC23 pic.twitter.com/of09OrFRVu
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2023