iDreamPost
android-app
ios-app

VIDEO: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సచిన్ కుమార్తె.. కన్ఫర్మ్ చేసిన క్రికెటర్!

  • Author singhj Published - 12:46 PM, Wed - 15 November 23

సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ ముద్దుల కూతురు సారా పెళ్లి కూతురు కాబోతున్నారని స్వయంగా ఓ క్రికెటర్ హింట్ ఇచ్చాడు.

సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ ముద్దుల కూతురు సారా పెళ్లి కూతురు కాబోతున్నారని స్వయంగా ఓ క్రికెటర్ హింట్ ఇచ్చాడు.

  • Author singhj Published - 12:46 PM, Wed - 15 November 23
VIDEO: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సచిన్ కుమార్తె.. కన్ఫర్మ్ చేసిన క్రికెటర్!

క్రికెటర్లకు భారత్​లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. టీమిండియాకు ఆడుతున్నారంటే చాలు.. వాళ్లను తమ ఐడల్స్​గా భావిస్తుంటారు అభిమానులు. ప్లేయర్లను ఇన్​స్పిరేషన్​గా తీసుకునేవారు కూడా ఎందరో ఉన్నారు. వాళ్లలా కష్టపడి తామూ పైకి రావాలని కోరుకుంటారు. గ్రౌండ్​తో పాటు మైదానం బయట క్రికెటర్ల లైఫ్​లో జరిగే విషయాలనూ ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. అందుకే జెంటిల్మన్ గేమ్​కు సంబంధించిన ఆటగాళ్ల జీవితాల్లోని చాలా విషయాల గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఏ ప్లేయర్ ఎవర్ని లవ్ చేస్తున్నాడు, ఎవర్ని మ్యారేజ్ చేసుకోబోతున్నాడు లాంటి విషయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విషయాల మీదే నెట్టింట అధికంగా రూమర్స్ వస్తుంటాయి.

భారత టీమ్​లో రాకెల్​లా దూసుకొచ్చిన యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ గురించి కూడా ఊహాగానాలు రావడం చూసే ఉంటారు. తక్కువ టైమ్​లోనే టీమిండియాలో తన ప్లేస్​ను పర్మినెంట్ చేసుకున్న ఈ ప్లేయర్ పర్సనల్ లైఫ్​ గురించి సోషల్ మీడియాలో ఏవేవో కథనాలు వస్తుంటాయి. సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్ లాంటి ప్రముఖులతో గిల్ పేరును ముడిపెట్టి అతడు లవ్​లో ఉన్నాడంటూ వార్తలు రావడం తెలిసిందే. అయితే శుబ్​మన్​తో తాను ప్రేమలో లేనంటూ రీసెంట్​గా సారా అలీ ఖాన్ క్లారిటీగా చెప్పేసింది. అయితే బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా మాత్రం గిల్​తో ప్రేమాయణంపై ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. దీనికి తోడు భారత మ్యాచులకు తరచూ అటెండ్ అవుతూ శుబ్​మన్​ను ఎంకరేజ్ చేస్తూ కెమెరా కళ్లకు చిక్కడం వీళ్ల రిలేషన్​ను మరింత బలపరుస్తోందని అంటున్నారు. సారా-గిల్ లవ్​లో ఉన్నారని.. వీళ్లు తమ ప్రేమను త్వరలో అందరికీ చెబుతారని నెట్టింట వార్తలు కూడా వస్తున్నాయి.

వరల్డ్ కప్​లో టీమిండియా ఆడిన మ్యాచులకు సారా టెండూల్కర్ హాజరవ్వడం, గిల్​ను ప్రోత్సహిస్తూ ఆమె సందడి చేయడంతో జనాలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ యువ జంటకు సంబంధించి మరో న్యూస్ వైరల్​గా మారింది. ఈ యంగ్ లవ్ బర్డ్స్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు.. ఇప్పటికే వీరి మ్యారేజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిందని నెట్టింట వినిపిస్తోంది. సారా-గిల్ రిలేషన్​షిప్​పై యూఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది. నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయే క్రికెటర్ ఎవరని అతడ్ని అడగ్గా.. శుబ్​మన్ పేరు చెప్పాడు చిరాగ్. గిల్​కు లవర్ ఉందని, ఆమె మరెవరో కాదు సచిన్ టెండూల్కర్ కూతురు సారా అని చిరాగ్ రివీల్ చేశాడు. చిరాగ్ కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ అతను చెప్పింది నిజమైతే సచిన్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగడం ఖాయమే. అయితే చిరాగ్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్​గా మారడంతో అతడ్ని గిల్ అన్​ఫాలో చేయడం గమనార్హం. మరి.. గిల్-సారా పెళ్లి వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​.. టీమిండియాలో వాళ్లు ఆడటం ఫిక్స్!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio