iDreamPost
android-app
ios-app

వీడియో: ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న భారత ఆటగాళ్లు!

  • Author singhj Published - 08:23 AM, Mon - 20 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలవ్వడంతో భారత ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వాళ్లను చూసి ఫ్యాన్స్ కూడా ఏడ్చేశారు.

వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలవ్వడంతో భారత ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వాళ్లను చూసి ఫ్యాన్స్ కూడా ఏడ్చేశారు.

  • Author singhj Published - 08:23 AM, Mon - 20 November 23
వీడియో: ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న భారత ఆటగాళ్లు!

ఎన్నో ఆశలు పెట్టుకున్న వన్డే వరల్డ్ కప్-2023 భారత్ చేజారింది. లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు 9 అద్భుత విజయాలతో దూసుకొచ్చిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. మెగా టోర్నీ మొత్తం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​లో సూపర్బ్​గా పెర్ఫార్మ్ చేస్తూ వచ్చిన రోహిత్ సేనకు ఆదివారం ఆసీస్​తో ఫైనల్​ ఫైట్​లో ఏదీ కలసి రాలేదు. ఏ ఒక్క విభాగంలోనూ తన రేంజ్​కు తగ్గట్టు ఆడలేకపోయింది. దీంతో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ముచ్చటగా మూడోమారు కప్పును అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆరోసారి ప్రపంచ కప్​ను నెగ్గిన టీమ్​గా చరిత్ర సృష్టించింది ఆసీస్. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన కంగారూ కెప్టెన్ పాట్ కమిన్స్.. భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు.

డ్రైగా ఉన్న అహ్మదాబాద్ పిచ్​ మీద బాల్ సరిగ్గా బ్యాట్ మీదకు రాని పరిస్థితి. అయినా కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 47) తను ఎక్స్​పీరియెన్స్​తో బాగా ఆడాడు. మొదటి రెండు, మూడు ఓవర్లు పిచ్​ను అర్థం చేసుకునేందుకు టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన స్టైల్​లో బౌండరీలు, సిక్సులు కొడుతూ ఆసీస్​ను కంగారెత్తించాడు. అయితే మరో ఓపెనర్ శుబ్​మన్ గిల్ (7 బంతుల్లో 4) మాత్రం త్వరగా పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 54)తో కలసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు హిట్​మ్యాన్. కానీ మాక్స్​వెల్ బౌలింగ్​లో అప్పటికే 10 రన్స్ వచ్చినా.. మరో భారీ షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టిన క్యాచ్ మ్యాచ్​కు టర్నింగ్ పాయింట్​గా మారింది.

రోహిత్ శర్మ ఔటైన తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (3 బంతుల్లో 4)ను కమిన్స్ క్రీజులో కుదురుకోనివ్వలేదు. చక్కటి బాల్​కు అతడ్ని బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 66)తో కలసి కోహ్లీ ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. అయితే త్వరత్వరగా వికెట్లు పడిపోవడంతో వీళ్లిద్దరూ స్లోగా బ్యాటింగ్ చేశారు. 11 నుంచి 50 ఓవర్ల వరకు కేవలం 4 బౌండరీలు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి మన బ్యాటింగ్ అప్రోజ్, ఆసీస్ బౌలింగ్, ఫీల్డింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవాలి. గేమ్​లో స్పీడ్ పెంచుదామని ప్రయత్నించిన ప్రతిసారీ భారత్ వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (9), సూర్యకుమార్ యాదవ్ (18) కూడా భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో టెయిలెండర్లు పోరాడటంతో స్కోరు 240కు చేరుకుంది. ఈజీ టార్గెట్​తో బరిలోకి దిగిన ఆసీస్ 43 ఓవర్లలోనే 4 వికెట్లకు 241 రన్స్ చేసేసింది. జస్​ప్రీత్ బుమ్రా (2 వికెట్లు), మహ్మద్ షమి (1 వికెట్) దెబ్బకు 47 రన్స్​కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కంగారూ టీమ్.

మూడు వికెట్లు పడిపోవడంతో కష్టాల్లో ఉన్న ఆసీస్​ను ట్రావిస్ హెడ్ (120 బంతుల్లో 137), మార్నస్ లబుషేన్ (110 బంతుల్లో 58) అదుకున్నారు. ఈ ఇద్దరూ అద్భుతమైన పార్ట్​నర్​షిప్​తో తమ టీమ్​కు కప్పు అందించారు. హెడ్ ఒంటిచేత్తో మ్యాచ్​ను గెలిపించాడని చెప్పాలి. అయితే నెగ్గిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ భారత ప్లేయర్లు మాత్రం ఓటమి బాధను తట్టుకోలేకపోయారు. సొంత ప్రేక్షకులు, అభిమానుల మధ్య కప్పు గెలవాలనే కోరిక తీరకపోవడం, వరుస విజయాల తర్వాత ఫైనల్ మ్యాచ్​లో ఓడిపోవడంతో కన్నీళ్లను ఆపులేకపోయారు. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రాలు ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. మీరు ఛాంపియన్స్, గెలిచినా ఓడినా మీకు మేం అండగా ఉంటామని ఓదారుస్తున్నారు. మరి.. ఫైనల్ మ్యాచ్​లో భారత్ ఓటమిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫైనల్‌లో రోహిత్‌ పెద్ద తప్పు చేశాడా? ఆ ఒక్క నిర్ణయం కొంపముంచిందా?