iDreamPost

ఫైనల్‌లో రోహిత్‌ పెద్ద తప్పు చేశాడా? ఆ ఒక్క నిర్ణయం కొంపముంచిందా?

  • Published Nov 19, 2023 | 9:14 PMUpdated Nov 20, 2023 | 12:35 PM

12 ఏళ్ల తర్వాత టీమిండియా మరోసారి వరల్డ్‌ కప్‌ సాధిస్తుందని ఆశపడిన వారికి నిరాశే ఎదురైంది. ఓటమి ఎదరుగని జట్టుగా ఫైనల్‌కు వెళ్లిన రోహిత్‌ సేన.. తుది పోరులో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. అయితే.. ఫైనల్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీసుకున్న ఒక్క నిర్ణయం ఓటమిని శాసించిందని చాలా మంది భావిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

12 ఏళ్ల తర్వాత టీమిండియా మరోసారి వరల్డ్‌ కప్‌ సాధిస్తుందని ఆశపడిన వారికి నిరాశే ఎదురైంది. ఓటమి ఎదరుగని జట్టుగా ఫైనల్‌కు వెళ్లిన రోహిత్‌ సేన.. తుది పోరులో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. అయితే.. ఫైనల్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీసుకున్న ఒక్క నిర్ణయం ఓటమిని శాసించిందని చాలా మంది భావిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 19, 2023 | 9:14 PMUpdated Nov 20, 2023 | 12:35 PM
ఫైనల్‌లో రోహిత్‌ పెద్ద తప్పు చేశాడా? ఆ ఒక్క నిర్ణయం కొంపముంచిందా?

100 కోట్ల మందికి పైగా కన్న కల చెదిరిపోయింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే మిగిలింది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో ఏకంగా ఆరోసారి ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌ గా నిలిచింది. ముచ్చటగా మూడోసారి కప్పు కొడదామనుకున్న రోహిత్‌ సేన ప్రయత్నం విఫలమైంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. ఏ జట్టునైతే.. టోర్నీ తొలి మ్యాచ్‌ లో ఓడించి.. వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టిందో.. అదే జట్టు చేతిలో చివరి మ్యాచ్‌ లో ఓడి కప్పును చేజార్చుకుంది.

అయితే.. ఈ ఫైనల్‌ ఓటమిలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం కూడా కారణంగా నిలిచిందని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయాపడుతున్నారు. ఈ మ్యాచ్‌ లో టాస్‌ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడం, పిచ్‌ బ్యాటింగ్‌ కు కష్టంగా ఉండటంతో రోహిత్‌ శర్మ, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. గిల్‌, అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ దారుణంగా విఫలం అవ్వడం కూడా టీమిండియా తక్కువ స్కోర్‌ కు కారణంగా నిలిచింది. ఇక 241 పరుగుల టార్గెట్‌ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను మన బౌలర్లు ఆరంభంలో వణికించారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన షమీ.. తన తొలి ఓవర్‌లోనే భారత్‌ కు తొలి వికెట్‌ అందించాడు. వార్నర్‌ ను అవుట్‌ చేసి భారత్‌ కి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

ఆ తర్వాత బుమ్రా సైతం రెండు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ ఒత్తిడిలోకి వెళ్లింది. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో టీమిండియాదే కప్పు అనుకున్నారంతా.. కానీ, ఆ తర్వాత సీన్‌ మారిపోయింది. కాగా, షమీకి ఫస్ట్‌ వికెట్‌ దక్కినా.. అతనితో కొత్త బంతితో బౌలింగ్‌ వేయించడమే టీమిండియా విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆరంభం ఓవర్లలో పిచ్‌ నుంచి స్వింగ్‌ లభించింది. ఆ పరిస్థితుల్లో షమీ కంటే సిరాజ్‌ చాలా ఎఫెక్టీవ్‌ గా ఉండేవాడు. కానీ, ఈ టోర్నీ మొత్తం బాల్‌ కాస్త పాతబడిన తర్వాత బౌలింగ్‌ కు వచ్చిన షమీ.. ఈ మ్యాచ్‌ లో కొత్త బంతిని కంట్రోల్‌ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.

ఒక వికెట్‌ తీసినా.. వైడ్లు, భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. అలాగే కొత్త బంతితో ఎఫెక్టివ్‌గా ఉండే సిరాజ్‌.. పాత బంతితో తేలిపోయాడు. దీంతో రోహిత్‌ శర్మ తీసుకున్న నిర్ణయం ఇద్దరు బౌలర్లుపైనే కాకుండా జట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. అలా కాకుండా సెమీస్‌ వరకు కొనసాగించిన పద్ధతి.. బుమ్రా-సిరాజ్‌ తో తొలి స్పెల్‌, పవర్‌ ప్లే తర్వాత షమీని బౌలింగ్‌ కు తీసుకొని వచ్చి ఉంటే చాలా బాగుండేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ టోర్నీ అసాంతం రోహిత్‌ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి