Virat Kohli: ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండటం విరాట్ లక్షణం! అందుకు ఈ వీడియోనే సాక్ష్యం..

ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగినా గానీ.. ఒదిగి ఉండటం విరాట్ కోహ్లీ లక్షణం. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని అతడు మరోసారి రుజువుచేశాడు. బహుశా ఈ సీన్ ను ఎవ్వరూ గమనించి ఉండరు.

ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగినా గానీ.. ఒదిగి ఉండటం విరాట్ కోహ్లీ లక్షణం. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని అతడు మరోసారి రుజువుచేశాడు. బహుశా ఈ సీన్ ను ఎవ్వరూ గమనించి ఉండరు.

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన ఆటతీరుతో దిగ్గజ క్రికెటర్లను సైతం ఫ్యాన్స్ గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం. అంతర్జాతీయ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు సాధించి.. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో ఏలుతున్నాడు. ఇలా ఎన్నో ఘనతలను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకుని ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగినా గానీ.. ఒదిగి ఉండటం కోహ్లీ లక్షణం. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ విషయాన్ని అతడు మరోసారి రుజువుచేశాడు. బహుశా ఈ సీన్ ను ఎవ్వరూ గమనించి ఉండరు.

టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ విన్నింగ్ పరేడ్ తర్వాత ఈ వేడుక జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ తన గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు. దాంతో దటీజ్ కోహ్లీ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే? ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన చెక్ ను ఇవ్వడానికి ఆటగాళ్లను స్టేజ్ పైకి పిలిచారు.

ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు చెక్ అందుకునేందుకు ముందుకు కదిలారు. అందరికంటే ముందు ఉన్న కోహ్లీని స్టేజ్ పై ఉన్న ప్రముఖులు వేదిక ఎక్కాల్సిందిగా పిలిచారు. కానీ విరాట్ కోహ్లీ అందుకు ఒప్పుకోకపోగా.. తన వెనకే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మను ముందుకు పంపి.. ఆ తర్వాత వస్తున్న వైస్ కెప్టెన్ హార్దిక్ కు వెన్నుతట్టి స్టేజ్ ఎక్కమన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచ క్రికెట్ ను తన బ్యాట్ తో శాసిస్తున్న విరాట్.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటాడు అన్నదానికి ఇదో మచ్చుతునక అని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కాగా.. మిగతా ప్లేయర్లు ఎవరైనా.. ముందున్నాం కదా అని స్టేజ్ ఎక్కేవారే.. కానీ అక్కడుంది విరాట్ కోహ్లీ, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. అదీకాక ఈ వేడుకలో కోహ్లీ తన స్పీచ్ తో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ కార్యక్రమంలో బుమ్రా వీడియో ప్లే కాకపోవడంతో.. రియాక్ట్ అయిన కోహ్లీ వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ బుమ్రాకి ఇచ్చి.. అందరిచేత చప్పట్లు కొట్టించాడు. దాంతో ఇంతటి గొప్ప మనసు ఉన్న తమ అభిమాన ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments