SNP
Rohit Sharma, BGT 2024, Cricket News: రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా తొలి టెస్ట్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి రోహిత్ లేని టీమిండియా ఎలా ఆడుతుందో అనే ఆందోళన అందరిలో ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, BGT 2024, Cricket News: రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా తొలి టెస్ట్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి రోహిత్ లేని టీమిండియా ఎలా ఆడుతుందో అనే ఆందోళన అందరిలో ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా ఒక అగ్నిపరీక్ష కోసం సిద్ధం అవుతోంది. ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం తలపడనుంది భారత్ జట్టు. గతంలో జరిగిన బీజీటీల్లో టీమిండియా ఆధిపత్యం చాటినప్పటికీ.. ఈ ఏడాది జరగబోయే ట్రోఫీ మాత్రం చాలా ప్రత్యేకం. ఎంతుకంటే.. వచ్చే ఏడాది అంటే.. 2025లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడాలంటే.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 4-0తో లేదా కనీసం 3-1తోనైనా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో 3-1తో బీజీటీ గెలిచిన చరిత్ర ఇండియాకు లేదు. ఒక వేళ అదే జరిగితే.. భారత జట్టు కొత్త చరిత్రను లిఖించడంతో పాటు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరే ఛాన్స్ ఉంటుంది. కానీ, అది జరిగే పరిస్థితి మాత్రం చాలా టఫ్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శన అంత బాగా లేదు. ముఖ్యంగా టీమిండియాకు రెండు కళ్లలాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు ఫామ్‌లో లేరు.
అదేముంది.. వాళ్లిద్దరు ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చారంటే.. దుమ్ములేపుతారు అని అనుకోవచ్చు.. కానీ, రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండటం లేదనే వార్త ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో వైరల్ అవుతుంది. పైగా మొదటి టెస్ట్‌తో పాటు రెండో టెస్ట్‌కు కూడా రోహిత్ శర్మ డౌటే అని కూడా రిసెంట్ టాక్. ఒక వేళ అదే నిజమైతే టీమిండియా.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఎదుర్కొగలదా? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫామ్‌లో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ లేకుంటే కనీసం ఆసీస్‌కు పోటీ అయినా ఇస్తుందా అనే డౌట్స్ అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా పిచ్‌లపై రోహిత్ శర్మకు అంత మంచి రికార్డుల లేకపోయినప్పటికీ.. ఒక కెప్టెన్‌గా టీమిండియాను అతను సమర్థవంతంగా నడిపించగలడు. అలాగే.. ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా.. ఒక్కసారి తన లయను అందుకుంటే మాత్రం రోహిత్‌ను ఆపడం ఎవరితరం కాదు. ఎదురుగా ఎలాంటి బౌలర్ ఉన్నా.. ఏ పిచ్‌పైనైనా కూడా అద్భుతంగా బ్యాటింగ్ గల సత్తా రోహిత్ శర్మ ఉంది.
అందుకే.. రోహిత్ లేకపోవడం టీమిండియాపై కచ్చితంగా పెను ప్రభావం చూపుతుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఒక వేళ నిజంగానే రోహిత్ అందుబాటులో లేకుంటే.. రోహిత్ ప్లేస్‌లో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడిస్తామని ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ కూడా ప్రకటించాడు. కానీ, రాహుల్ కూడా పెద్దగా ఫామ్‌లో లేడు. పైగా టీమిండియాకు ఎంతో కీలకమైన ఈ సిరీస్‌కి ముందు రోహిత్ శర్మ జట్టుకు దూరం అవుతుండటంపై కూడా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రోహిత్ శర్మ తన వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవలె స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 0-3తో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా దారుణంగా విఫలం అయ్యారు.
వారిద్దరూ పరుగులు చేయకుంటే.. జట్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకు కూడా అర్థమైంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో వాళ్లిద్దరు రన్స్‌చేయడం టీమ్‌కు ఎంతో అవసరం. యువ క్రికెటర్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకోలేం. పైగా ఒక బాధ్యత తీసుకొని.. టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లు కూడా పెద్దగా టీమ్‌లో ఎవరు కనిపించడం లేదు. అందరు అగ్రెసివ్ ఇంటెంట్‌తోనే ఆడుతున్నారు. కొన్ని సార్లు అది సక్సెస్ కావొచ్చు కానీ.. ప్రతి సారి వర్క్ అవుట్ అవ్వదు. ఆ విషయం న్యూజిలాండ్‌తో మూడో టెస్టుల సిరీస్‌లో కూడా బోధపడింది. మరి కెప్టెన్‌గా, ఓపెనర్‌గా టీమిండియాలో ఎంతో కీలకమైన పొజిషన్‌లో ఉన్న రోహిత్ శర్మ.. తొలి టెస్ట్‌కు దూరమైతే.. టీమిండియా ఎంత వరకు ఆసీస్‌కు పోటీ ఇస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.