Somesekhar
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మరో నజరానా దక్కింది. ఇప్పటికే బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించగా.. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మరో నజరానా దక్కింది. ఇప్పటికే బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించగా.. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 ప్రపంచ కప్ 2024 సాధించి స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లకు అఖండ స్వాగతం లభించింది. విమానం దిగిన దగ్గర నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ముగిసే వరకు అభిమానులు ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు. ముంబై వీధుల్లో జరిగిన విజయోత్సవ ర్యాలీ అయితే చూడ్డానికి రెండు కళ్లు చాలలేదు. రోడ్లన్నీ జన సంద్రంగా మారిపోయాయి. ఇదిలా ఉండగా.. టీమిండియాకు మరో నజరానా దక్కింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ. 11 కోట్ల ప్రైజ్ మనీని భారత జట్టుకు ప్రకటించారు.
పొట్టి ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏకంగా రూ. 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని భారత జట్టుకు ప్రకటించింది. తాజాగా మరో నజరానా టీమిండియాకు దక్కింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ. 11 కోట్ల నగదు బహుమతిని భారత జట్టుకు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం విధాన్ భవన్ సెంట్రల్ హాల్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేలను సీఎం సన్మానించారు. ఈ సందర్భంగా నజరానాను ప్రకటించారు.
ఇక ఈ కార్యక్రమంలో క్రికెటర్లతో పాటుగా టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి టీమిండియాకు రూ. 11 కోట్ల నగదు బహుమతి ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Maharashtra Chief minister Eknath Shinde announced 11 crores for Rohit, Surya, Dube & Jaiswal for winning the T20I World Cup 🏆 pic.twitter.com/Xn09wdcMsG
— Johns. (@CricCrazyJohns) July 5, 2024