iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీని మించిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా!

  • Published Oct 17, 2024 | 12:46 PM Updated Updated Oct 17, 2024 | 12:46 PM

Ajay Jadeja, Virat Kohli: విరాట్‌ కోహ్లీని టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా దాటేశాడు. మరి అది ఏ విషయంలో అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Ajay Jadeja, Virat Kohli: విరాట్‌ కోహ్లీని టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా దాటేశాడు. మరి అది ఏ విషయంలో అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Oct 17, 2024 | 12:46 PMUpdated Oct 17, 2024 | 12:46 PM
విరాట్‌ కోహ్లీని మించిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా!

ఫేస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ క్రికెట్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ.. సంపదలో కూడా నంబర్‌ వన్‌గా ఉన్నాడు. ఇండియాలో అత్యంత ధనిక క్రికెటర్‌గా ఉన్న కోహ్లీని.. టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా దాటేశాడు. అది కూడా ఒక్కరాత్రిలోనే జరిగిపోయింది. అవును మీరు విన్నది నిజమే.. ఆస్తి విషయంలో కేవలం ఒక్క రాత్రిలోనే కోహ్లీని జడేజా దాటేశాడు. విరాట్‌ కోహ్లీ నికర ఆస్తి విలువ సుమారు రూ.1,090 కోట్లు. ఇంత ఆస్తితో విరాట్‌ కోహ్లీ ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆస్తి ఉన్న క్రికెటర్‌గా ఉన్నాడు. కానీ, అజయ్‌ జడేజా ఒక్క రోజులోనే ఏకంగా రూ.1,450 కోట్ల ఆస్తికి వారసుడయ్యాడు. దీంతో.. ఇండియాలో ఎక్కువ ఆస్తి ఉన్న క్రికెటర్‌గా నిలిచాడు జడేజా. ఇది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

అజయ్‌ జడేజా అంటే చాలా మందికి అతనో టీమిండియా మాజీ క్రికెటర్‌గానే తెలుసు. ఇండియాకు ఆడిన మోస్ట్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌, 1999లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అజయ్‌ జడేజా ఒక రాజవంశానికి చెందిన వ్యక్తి. జడేజా వంశానికి చెందిన పూర్వీకులు కూడా క్రికెట్‌ ఆడేవారు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు.. రాజులే క్రికెట్‌ ఆడేవారు. అందులో జడేజా పూర్వీకులైన రంజిత్‌ సింహ్‌జీ, దులీప్‌సింహ్‌జీ కూడా క్రికెట్‌ ఆడారు. వారి పేర్ల మీదే.. రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీలు నిర్వహిస్తున్నారు. అంత ఘనమైన చరిత్ర కలిగిన వంశం నుంచి వచ్చిన అజయ్‌ జడేజా కూడా.. వాళ్ల పూర్వీకుల్లానే మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

తాజాగా అక్టోబర్‌ 12న దసరా సందర్భంగా జామ్‌ సాహెబ్‌ మహారాజా శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా తన వారసుడిగా అజయ్‌ జడేజాను ప్రకటించారు. మహారాజా శత్రుసల్యసింహ్‌జీకి అజయ్‌ జడేజా మేనల్లుడు అవుతాడు. ఆయన ప్రకటనతో అజయ్‌ జడేజా జామ్‌నగర్‌ రాజకుంటుబానికి మహారాజా అయ్యాడు. దీంతో.. ఆయన వేల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు. అలా.. ఒక టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇక జడేజా క్రికెట్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన జడేజా.. టీమిండియా తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు. అందులో 6 సెంచరీలు , 34 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 6 వేల పరుగులు, 20 వికెట్లు ఉన్నాయి. మరి సంపద విషయంలో అజయ్‌ జడేజా విరాట్‌ కోహ్లీని దాటేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.