iDreamPost
android-app
ios-app

రేపే న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌.. కివీస్‌కు రోహిత్‌ శర్మ వార్నింగ్‌!

  • Published Oct 15, 2024 | 6:35 PM Updated Updated Oct 15, 2024 | 6:35 PM

Rohit Sharma, IND vs NZ, Cricket News: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. న్యూజిలాండ్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. బుధవారం నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. మరి ఆ కామెంట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, IND vs NZ, Cricket News: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. న్యూజిలాండ్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. బుధవారం నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. మరి ఆ కామెంట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 15, 2024 | 6:35 PMUpdated Oct 15, 2024 | 6:35 PM
రేపే న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌.. కివీస్‌కు రోహిత్‌ శర్మ వార్నింగ్‌!

ఆట కంటే ముందే.. మాటతో న్యూజిలాండ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. భారత జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చింది కివీస్‌ జట్టు. బుధవారం నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు కొన్ని రోజుల క్రితమే జట్టును కూడా ప్రకటించారు. అయితే.. ఈ టెస్ట్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. మీడియాతో మాట్లాడాడు. ‘ప్రతి టీమ్‌ కూడా ఒక కొత్త ఛాలెంజ్‌తో వస్తుంది. న్యూజిలాండ్‌ కూడా అంతే అని. మేం ఏ టీమ్‌తో ఆడినా.. వేర్వేరు ఛాలెంజెస్‌ ఉంటాయి. పైగా న్యూజిలాండ్‌తో గతంలో చాలా మ్యాచ్‌లు ఆడాం. ఆ జట్టులోని ఆటగాళ్ల గురించి మాకు తెలుసు. వాళ్ల బలం, బలహీనతలపై మాకు మంచి అవగాహన ఉంది.’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఇటీవల బంగ్లాదేశ్‌ను 2-0తో టీమిండియా వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో న్యూజిలాండ్‌ను కూడా ఎదుర్కొంటారా? అనే ప్రశ్నకు రోహిత్‌ శర్మ బదులిస్తూ.. పైవిధంగా పేర్కొన్నాడు. అంటే.. బంగ్లాపై చూపించిన ఇంటెంట్‌, ఆ అగ్రెషన్‌ న్యూజిలాండ్‌పై కూడా చూపిస్తారా అంటే.. లేదు లేదు.. బంగ్లా వేరే టీమ్‌, న్యూజిలాండ్‌ వేరే టీమ్‌, రెండు టీమ్స్‌ బలాలు, బలహీనతలు వేరు, వాటికి తగ్గట్లు మా గేమ్‌ ప్లాన్‌ ఉంటుంది అనే ఉద్దేశంతో రోహిత్‌ మాట్లాడాడు. అయితే.. ఈ వ్యాఖ్యల్లో న్యూజిలాండ్‌ బలం బలహీనత మాకు తెలుసు అని రోహిత్‌ చెప్పడంతో కివీస్‌ జట్టులో కలవడం మొదలైంది. ఇండియాను ఇండియాలో ఎదుర్కొవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌.. ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే తమ జట్టు బలహీతలు ఏంటో కూడా తెలుసు అని ఒక విధంగా న్యూజిలాండ్‌ జట్టుకు వార్నింగ్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సూపర్‌ అగ్రెసివ్‌గా బ్యాటింగ్‌ చేసి.. మ్యాచ్‌ను గెలిచిన విషయం తెలిసిందే. రెండు రోజుల ఆట వర్షం కారణంగా రద్దు అయినా.. మ్యాచ్‌ గెలవాలనే కసితో టీమిండియా టెస్ట్‌ను టీ20 స్టైల్లో ఆడి.. బంగ్లాను చిత్తు చేసింది. దీంతో.. ఇంగ్లండ్‌ను బజ్‌బాల్‌ను మించి.. రోహిత్‌ గమ్‌బాల్‌ ఉందంటూ క్రికెట్‌ లోకం ఆశ్చర్యపోయింది. బంగ్లా అంటే కాస్త చిన్న టీమ్‌, కానీ, న్యూజిలాండ్‌ అలా కాదు.. అందుకే కివీస్‌పై టీమిండియా ఎలాంటి స్ట్రాటజీతో ఆడుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే.. టీమిండియాలో యంగ్‌ ప్లేయర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి రన్స్‌ కోసం మాత్రం క్రికెట్‌ ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌పై టెస్ట్‌ సిరీస్‌లో కోహ్లీ రాణించలేదు. దీంతో.. న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లోనైనా.. కోహ్లీ రన్స్‌ చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి న్యూజిలాండ్‌తో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? అలాగే ఈ సిరీస్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ న్యూజిలాండ్‌కు వార్నింగ్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.