స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు ఇది మాస్టర్ బ్లాస్టర్ సచిన్-కింగ్ కోహ్లీ పాత వీడియోను గుర్తుచేయడమే గాక.. భవిష్యత్తుపై బాధ్యతను, నమ్మకాన్ని కూడా ఇస్తోందని అంటున్నారు.
స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు ఇది మాస్టర్ బ్లాస్టర్ సచిన్-కింగ్ కోహ్లీ పాత వీడియోను గుర్తుచేయడమే గాక.. భవిష్యత్తుపై బాధ్యతను, నమ్మకాన్ని కూడా ఇస్తోందని అంటున్నారు.
వన్డే వరల్డ్ కప్-2023లో లీగ్ స్టేజ్‌ను టీమిండియా సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లోనూ నెగ్గి సెమీస్‌కు రెడీ అయిపోయింది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన 160 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 410 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన డచ్ టీమ్ 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో తేజ నిడమనూరు (39 బంతుల్లో 54). ఎంగెల్‌బ్రెచ్ట్ (80 బంతుల్లో 45) రాణించారు. కోలిన్ ఆకెర్మాన్ (32 బంతుల్లో 35), మాక్స్ ఔడౌడ్ (42 బంతుల్లో 30) ఫర్వాలేదనిపించారు.
టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా తలో వికెట్ తీయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేయడం విశేషం. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ (54 బంతుల్లో 61), శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లిద్దరూ అటాకింగ్ గేమ్ ఆడటంతో 11.5 ఓవర్లలోనే స్కోరు 100 రన్స్ దాటింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తక్కువ టైమ్‌లోనే వెనుదిరిగారు.
రోహిత్, గిల్ వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ (56 బంతుల్లో 51), శ్రేయస్ అయ్యర్ (91 బంతుల్లో 128 నాటౌట్) భారత్‌ను ఆదుకున్నారు. హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ ఔటైనా కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102)తో కలసి అయ్యర్ పరుగుల వరద పారించాడు. వీళ్లిద్దరూ కలసి ఫోర్త్ వికెట్‌కు ఏకంగా 208 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఆఖర్లో రాహుల్ ఔటైనా అప్పటికే భారత్ భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. రోహిత్, గిల్, కోహ్లీ హాఫ్ సెంచరీలు బాదారు. అయ్యర్, రాహుల్ సెంచరీలతో మోత మోగించారు.
లాస్ట్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు కేవలం ఒకే బాల్ ఆడే ఛాన్స్ వచ్చింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో అయ్యర్-రాహుల్ పార్ట్నర్షిప్ హైలైట్ అనే చెప్పాలి. వీళ్లిద్దరూ బౌండరీలు, సిక్సులతో డచ్ బౌలర్లను ఊచకోత కోశారు. వీళ్ల పార్ట్నర్షిప్ కారణంగానే భారత్ 400 పైచిలుకు స్కోరు చేసింది. ఇక స్టార్టింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఆట కూడా అందర్నీ ఆకట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన గిల్ ఏకంగా 4 సిక్సులు బాదాడు. అయితే అతడు ఔట్ అయి వెళ్తున్న టైమ్‌లో జరిగిన ఒక ఘటన అందరికీ ఒక పాత ఇన్సిడెంట్ను గుర్తుచేసింది. శుబ్‌మన్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ బౌండ్రీ లైన్ దగ్గర గిల్‌ను మెచ్చుకున్నాడు.
2011 వరల్డ్ కప్‌లో లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఔటై వెళ్తూ కోహ్లీకి బాగా ఆడాలని ధైర్యం చెబుతూ వెన్ను తట్టాడు. ఈ రెండు వీడియోలను కలిపి తయారు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. అప్పుడు క్రికెట్ గాడ్, కింగ్ కోహ్లీలాగే.. ఇప్పుడు విరాట్, ప్రిన్స్ గిల్ ఒకేలా కనిపించారని అంటున్నారు. భారత బ్యాటింగ్ భారాన్ని, ఫ్యూచర్‌ను కోహ్లీ మీద సచిన్ వదిలేశాడని.. నెక్స్ట్ టీమిండియాను నడిపే బాధ్యత గిల్లో ఉంది గనుకే అతడికి కోహ్లీ సపోర్ట్‌గా ఉంటున్నాడని అభిమానులు అంటున్నారు. మరి.. కోహ్లీ-గిల్ వీడియోపై మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. 6 బంతుల్లో 6 వికెట్లు!
Passing The Baton ❤️💙
Then Sachin Tendulkar to Virat Kohli
Now Virat Kohli to Shubman Gill#INDvsNED #ViratKohli #ShubmanGill pic.twitter.com/xObqbUoKEh— MEME_LORD (@meme_lord264) November 12, 2023