iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: రోహిత్, కోహ్లీకి సరైన వారసులు వాళ్లిద్దరే.. మాజీ క్రికెటర్ కామెంట్స్!

  • Published Jul 09, 2024 | 2:00 AM Updated Updated Jul 09, 2024 | 12:19 PM

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి కప్పు ఫైనల్ మ్యాచ్​తో ఆ ఫార్మాట్​ నుంచి వాళ్లిద్దరూ రిటైర్మెంట్ తీసుకున్నారు.

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి కప్పు ఫైనల్ మ్యాచ్​తో ఆ ఫార్మాట్​ నుంచి వాళ్లిద్దరూ రిటైర్మెంట్ తీసుకున్నారు.

  • Published Jul 09, 2024 | 2:00 AMUpdated Jul 09, 2024 | 12:19 PM
Rohit-Kohli: రోహిత్, కోహ్లీకి సరైన వారసులు వాళ్లిద్దరే.. మాజీ క్రికెటర్ కామెంట్స్!

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసిందే. పొట్టి కప్పు ఫైనల్ మ్యాచ్​తో ఆ ఫార్మాట్​ నుంచి వాళ్లిద్దరూ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒకవైపు భారత్ వరల్డ్ కప్ గెలిచిందన్న సంతోషం ఉన్నా.. మరోవైపు ఇద్దరు లెజెండరీ ప్లేయర్లు గేమ్​కు గుడ్​బై చెప్పారనే వార్త అభిమానులను బాధకు గురిచేసింది. అయితే రోకో జోడీ కెరీర్ చరమాంకంలో ఉండటం, ఎక్కువ కాలం క్రికెట్​లో కొనసాగాలంటే తప్పనిసరిగా ఏదో ఒక ఫార్మాట్​ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి నెలకొనడంతో వాళ్ల నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. అందునా వరల్డ్ కప్ గెలిచి టీ20లకు గుడ్​బై చెప్పడంతో వాళ్ల డెసిషన్ కరెక్టేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వీళ్ల వారసులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత దశాబ్దంన్నర కాలంగా టీ20ల్లోనే కాదు.. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టుకు మూలస్తంభాలుగా ఉంటూ వచ్చారు రోహిత్-కోహ్లీ. అలాంటిది ఇప్పుడు వాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మాట్​లో వాళ్ల స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. చాలా మంది యంగ్​స్టర్స్​ ఉన్నా ఆ రేంజ్​లో నిలకడగా రాణిస్తూ టీమ్​ను నిలబెడతారా అనేది అనుమానమే. ఈ విషయంపై జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసకద్జా రియాక్ట్ అయ్యాడు. రోకో జోడీ గుడ్​బై చెప్పినా భారత భవిష్యత్​కు ఢోకా లేదన్నాడు మసకద్జా. వాళ్లిద్దరికీ కరెక్ట్ రీప్లేస్​మెంట్​ శుబ్​మన్ గిల్-యశస్వి జైస్వాల్ అని చెప్పుకొచ్చాడు.

‘రోహిత్-కోహ్లీ లాంటి బిగ్ ప్లేయర్స్​ను రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ టీమిండియాలో ఎంతో మంది టాలెంటెడ్ యంగ్​స్టర్స్ ఉన్నారు. వాళ్లిద్దరి స్థానాన్ని భర్తీ చేసేవారిని వెతకడం మరీ కష్టమేం కాదు. అయితే నా మటుకైతే రోహిత్-కోహ్లీకి రీప్లేస్​మెంట్ అంటే శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్ పేర్లే చెబుతా. వీళ్లిద్దరూ కెరీర్​లో విరాట్, రోహిత్ స్థాయికి ఎదిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. గిల్ చాలా వేగంగా ఎదుగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ఆట చూశా. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. జైస్వాల్ కూడా తన ఇంటర్నేషనల్ కెరీర్​ను సూపర్బ్​గా స్టార్ట్ చేశాడు. వీళ్లిద్దరూ సుదీర్ఘ కాలం టీమ్​కు సేవలు అందించగలరు’ అని మసకద్జా చెప్పుకొచ్చాడు. మరి.. రోహిత్-కోహ్లీకి కరెక్ట్ రీప్లేస్​మెంట్ గిల్-జైస్వాల్ అనే అభిప్రాయంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.