iDreamPost
android-app
ios-app

సచిన్​లాగే అతడికి కూడా భారతరత్న ఇవ్వాలి.. మాజీ క్రికెటర్ డిమాండ్!

  • Published Jul 08, 2024 | 7:41 PM Updated Updated Jul 08, 2024 | 7:41 PM

Team India: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్​ తన కెరీర్​లో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాడు. మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కూడా అతడ్ని వరించింది. ఇప్పుడు ఇదే అవార్డును మరో టీమిండియా ప్లేయర్​కు ఇవ్వాలని ఓ లెజెండ్ డిమాండ్ చేస్తున్నాడు.

Team India: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్​ తన కెరీర్​లో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాడు. మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కూడా అతడ్ని వరించింది. ఇప్పుడు ఇదే అవార్డును మరో టీమిండియా ప్లేయర్​కు ఇవ్వాలని ఓ లెజెండ్ డిమాండ్ చేస్తున్నాడు.

  • Published Jul 08, 2024 | 7:41 PMUpdated Jul 08, 2024 | 7:41 PM
సచిన్​లాగే అతడికి కూడా భారతరత్న ఇవ్వాలి.. మాజీ క్రికెటర్ డిమాండ్!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్​ తన కెరీర్​లో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాడు. అతడ్ని పిలిచి మరీ చాలా దేశాలు పలు పురస్కారాలతో సత్కరించాయి. కొన్ని కంట్రీస్ పౌరసత్వాన్ని కూడా ఆఫర్ చేశాయి. ఇలా సచిన్ ఎన్నో ఘనతల్ని అందుకున్నాడు. మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కూడా అతడ్ని వరించింది. ఈ అవార్డును అందుకున్న తొట్ట తొలి క్రీడాకారుడు మాస్టర్​బ్లాస్టరే కావడం విశేషం. దేశానికి ఎన్నో అపూర్వమైన సేవలు అందిస్తే గానీ ఆ గౌరవం దక్కదు. అందునా తీవ్ర పోటీ ఉంటుంది. అయినా సచిన్​కు ఆ అవార్డు దక్కడంతో క్రీడాలోకం, అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. క్రికెట్ గాడ్ తర్వాత ఇప్పటిదాకా మరే ఆటగాడికీ భారతరత్న దక్కలేదు.

సచిన్ తర్వాత చాలా మంది క్రీడా దిగ్గజాల పేర్లు భారతరత్న అవార్డు రేసులో వినిపించినా ఎవర్నీ అది వరించలేదు. ఈ తరుణంలో లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్​కు భారతరత్న ఇవ్వాలని అన్నాడు. ఈ పురస్కారానికి అతడు అన్ని విధాలా అర్హుడని తెలిపాడు. సచిన్​కు ఇచ్చినట్లే ద్రవిడ్​కూ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘ద్రవిడ్​ను భారతరత్న పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి. ఆ గౌరవానికి అతడు పూర్తి అర్హుడు. ఓ ప్లేయర్​గా అతడు భారత క్రికెట్​కు ఎంతో సేవ చేశాడు. కెప్టెన్​గా కూడా టీమిండియాకు అపూర్వమైన విజయాలు అందించాడు. వెస్టిండీస్​లో సిరీస్ నెగ్గడం క్లిష్టంగా మారిన టైమ్​లో జట్టును గెలిపించాడు’ అని గవాస్కర్ తెలిపాడు.

వెస్టిండీస్​తో పాటు ఇంగ్లండ్​ గడ్డ మీదా జరిగిన సిరీస్​లో భారత్​ను విజేతగా నిలిపిన ఘనత ద్రవిడ్​దని గవాస్కర్ ప్రశంసించాడు. నేషనల్ క్రికెట్​ అకాడమీలో ఉంటూ ఎంతో మంది యువ ప్రతిభావంతులను సానబెట్టి టీమిండియాకు అందించాడని మెచ్చుకున్నాడు. సీనియర్ టీమ్ కోచ్​గా బాధ్యతలు చేపట్టి అన్ని ఫార్మాట్లలోనూ టీమ్​ను నంబర్​ వన్​గా నిలిపాడని చెప్పుకొచ్చాడు గవాస్కర్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​తో పాటు వన్డే వరల్డ్ కప్​లోనూ జట్టును ద్రవిడ్ ఫైనల్స్​కు చేర్చాడని.. తాజాగా టీ20 ప్రపంచ కప్​లో టీమ్​ను ఛాంపియన్​ను చేశాడని పేర్కొన్నాడు. అలాంటోడ్ని భారతరత్న పురస్కారంతో గౌరవించడం సముచితంగా ఉంటుందన్నాడు. మరి.. సచిన్​లాగే ద్రవిడ్​కు కూడా భారతరత్న ఇవ్వాలంటూ గవాస్కర్ చేసిన డిమాండ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.