iDreamPost
android-app
ios-app

సచిన్​కు గోల్డెన్ టికెట్​ ఇచ్చిన BCCI.. అసలు ఏంటీ టికెట్?

  • Author singhj Published - 04:07 PM, Fri - 8 September 23
  • Author singhj Published - 04:07 PM, Fri - 8 September 23
సచిన్​కు గోల్డెన్ టికెట్​ ఇచ్చిన BCCI.. అసలు ఏంటీ టికెట్?

క్రికెట్​లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ కప్​కు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 5వ తేదీన ఇండియా వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్​లను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మెగా టోర్నీకి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆగస్టు 25న విక్రయించిన తొలి దశ టికెట్లు.. కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో టికెట్లు దొరకని అభిమానులు నిరాశ చెందారు. వాళ్లకు ఊరట కలిగించేందుకు గానూ ఇవాళ మరోమారు టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు.

అభిమానుల కోసం వరల్డ్ కప్ టికెట్లను విక్రయిస్తున్న బీసీసీఐ.. భారత దిగ్గజాలను ఈ మెగా టోర్నీ చూసేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా వారికి గోల్డెన్ టికెట్లను అందజేస్తోంది. ముందుగా బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్​కు దాన్ని అందజేసింది. బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ బ్లాస్టర్​ను కలిశాడు. సచిన్​కు ప్రపంచ కప్ గోల్డెన్ టికెట్​ను ఆయన అందజేశాడు. దీంతో టీమిండియా తరఫున దాదాపు 20 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్​ను భారత క్రికెట్ బోర్డు సముచితంగా గౌరవించిందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.

గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియన్ ఐకాన్స్​ కార్యక్రమంలో భాగంగా దేశంలోని దిగ్గజాలకు ఈ టికెట్లను బీసీసీఐ అందజేస్తోంది. తాజాగా సచిన్​కు కూడా గోల్డెన్ టికెట్​ను అందజేశారు జై షా. సచిన్ క్రికెట్ ప్రయాణం అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని.. ఇప్పుడు ఆయన ఐసీసీ ప్రపంచ కప్​లో భాగం కానున్నారని బీసీసీఐ తెలిపింది. ఇక, ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ విషయానికొస్తే.. అక్టోబర్ 5వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడతాయి. భారత్​లోని పది వేదికల్లో ఈ మ్యాచ్​లు జరుగుతాయి. ఆరంభ మ్యాచ్​తో పాటు ఫైనల్​కు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇదీ చదవండి: మీ సలహాలు మాకు అక్కర్లేదు.. పాక్ మాజీలపై గవాస్కర్ సీరియస్!