iDreamPost
android-app
ios-app

Sachin Tendulkar: మెంటార్​ పోస్టుకు సచిన్ గుడ్​ బై.. ముంబై రియాక్షన్ ఇదే..!

  • Published Dec 18, 2023 | 4:26 PM Updated Updated Dec 18, 2023 | 4:26 PM

కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. మాజీ సారథి రోహిత్ శర్మ అభిమానులు​ ఆ టీమ్​ను టార్గెట్ చేసుకొని మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్​ చేస్తున్నారు.

కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. మాజీ సారథి రోహిత్ శర్మ అభిమానులు​ ఆ టీమ్​ను టార్గెట్ చేసుకొని మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్​ చేస్తున్నారు.

  • Published Dec 18, 2023 | 4:26 PMUpdated Dec 18, 2023 | 4:26 PM
Sachin Tendulkar: మెంటార్​ పోస్టుకు సచిన్ గుడ్​ బై.. ముంబై రియాక్షన్ ఇదే..!

ఐపీఎల్-2024 ఆక్షన్​కు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ క్రికెట్ దునియాను షేక్ చేసింది. ఐదు ట్రోఫీలు అందించిన సక్సెస్​ఫుల్ కెప్టెన్​ను ఇలా అర్ధంతరంగా తీసేయడం మీద తీవ్ర దుమారం రేగింది. హ్యూజ్ ఫ్యాన్ బేస్ కలిగిన హిట్​మ్యాన్​ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్​ను అవమానించారంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో ముంబైపై రివేంజ్ తీర్చుకుంటున్నారు. లక్షలాది మంది హిట్​మ్యాన్ ఫ్యాన్స్ ఎంఐని అన్​ఫాలో చేస్తున్నారు. దీంతో ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ మీద భారీగా ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో ముంబైకి మరో షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి. ఎంఐ మెంటార్ పోస్ట్​కు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుడ్ బై చెప్పాడని వినిపిస్తోంది.

రోహిత్​ శర్మను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించడం, తాము చెప్పిందే ఫైనల్ అంటూ అహంకారంగా ప్రవర్తించిన ముంబై ఫ్రాంచైజీపై సచిన్ సీరియస్​గా ఉన్నాడట. హార్దిక్​ పాండ్యాకు హఠాత్తుగా సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం, ఇన్ని ట్రోఫీలు అందించిన హిట్​మ్యాన్​ను తప్పించడం క్రికెట్ దేవుడికి నచ్చలేదట. ముంబై తీరుపై అసంతృప్తిగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ ఆ టీమ్ మెంటార్ పదవికి రాజీనామా చేశాడని టాక్. ఇప్పటికే సచిన్ తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేశాడని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇదే విషయంపై ఓ నేషనల్ మీడియా ఛానల్ మాస్టర్​ను డైరెక్ట్​గా సంప్రదించిందని తెలుస్తోంది. ఇవన్నీ ఒట్టి రూమర్లేనని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని సచిన్ కొట్టిపారేశాడని సమాచారం. అతడు మెంటార్​గా కొనసాగుతాడని.. రూమర్లను నమ్మొద్దని ముంబై ఫ్రాంచైజీ వర్గాలు కూడా నేషనల్ మీడియాకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సచిన్ తన పదవిలో కంటిన్యూ అవుతాడని పలు రిపోర్టులూ పేర్కొంటున్నాయి. కాగా, ముంబై ఇండియన్స్​కు 2014 నుంచి మెంటార్​గా సేవలు అందిస్తున్నాడు సచిన్. ఐదు సీజన్ల పాటు ఆ టీమ్​కు ఆడిన మాస్టర్ బ్లాస్టర్​.. కెప్టెన్​గానూ ముందుండి లీడ్ చేశాడు. ఓవరాల్​గా ఐపీఎల్ కెరీర్​లో 78 మ్యాచులు ఆడిన టెండూల్కర్ 2,334 రన్స్ చేశాడు. ముంబై టీమ్​లోని ప్లేయర్ల మధ్య ఫ్యామిలీ ఎన్విరాన్​మెంట్​ను క్రియేట్ చేయడంలో అతడు సక్సెస్ అయ్యాడు. దాన్ని ఆ తర్వాత కాలంలో కెప్టెన్​గా మారిన రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఇక, కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా విమర్శలపాలైన ముంబై.. సోషల్ మీడియాలో చాలా రకాలుగా టార్గెట్ అవుతోంది. దీనికి ఎప్పుడు ఫుల్​స్టాప్ పడుతుందో చూడాలి. మరి.. సచిన్ మెంటార్ పోస్ట్ నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు రావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Steve Smith: వీడియో: మ్యాచ్‌ మధ్యలో స్మిత్‌ పేపర్‌ క్యాచ్‌! మారుమోగిన స్టేడియం