iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ కాదు.. జైస్వాల్​కు ఓపెనర్​గా అతడ్ని ఆడించాలి: రవిశాస్త్రి

  • Published Jan 16, 2024 | 7:49 PM Updated Updated Jan 17, 2024 | 4:07 PM

ఆఫ్ఘానిస్థాన్​తో సిరీస్​తో టీ20ల్లోకి కమ్​బ్యాక్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్​ రోహిత్ శర్మ. అయితే అతడిపై భారత మాజీ హెడ్​ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ ఓపెనర్​గా పనికి రాడన్నాడు.

ఆఫ్ఘానిస్థాన్​తో సిరీస్​తో టీ20ల్లోకి కమ్​బ్యాక్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్​ రోహిత్ శర్మ. అయితే అతడిపై భారత మాజీ హెడ్​ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. హిట్​మ్యాన్ ఓపెనర్​గా పనికి రాడన్నాడు.

  • Published Jan 16, 2024 | 7:49 PMUpdated Jan 17, 2024 | 4:07 PM
Rohit Sharma: రోహిత్ కాదు.. జైస్వాల్​కు ఓపెనర్​గా అతడ్ని ఆడించాలి: రవిశాస్త్రి

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లో దుమ్మురేపుతోంది టీమిండియా. ఇప్పటిదాకా జరిగిన రెండు టీ20ల్లోనూ నెగ్గి సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో సిరీస్​లో మిగిలిన మరో మ్యాచ్​ నామమాత్రమే కానుంది. యశస్వి జైస్వాల్, శివమ్ దూబె లాంటి యంగ్​స్టర్స్ రెచ్చిపోయి ఆడుతుండటం ఈ సిరీస్​లో భారత్​కు బిగ్​ ప్లస్​గా చెప్పొచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా గోల్డెన్ డకౌట్​గా వెనుదిరగడం టీమిండియాను కలవరపరుస్తోంది. మొదటి టీ20లో 0 పరుగులకు రనౌట్​గా వెనుదిరిగాడు హిట్​మ్యాన్. మరో ఓపెనర్ శుబ్​మన్ గిల్​తో సమన్వయ లోపం వల్ల పెవిలియన్​కు చేరుకున్నాడు. రెండో టీ20లో చెత్త షాట్ ఆడి ఆఫ్ఘాన్ బౌలర్ ఫజల్​హక్ ఫారుకీకి దొరికిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ డక్స్​తో ప్రెజర్​లో ఉన్న రోహిత్​పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్ శర్మ ఓపెనర్​గా పనికి రాడన్నాడు రవిశాస్త్రి. టీ20ల్లో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్​కు జతగా విరాట్ కోహ్లీని ఓపెనర్​గా దించాలన్నాడు. హిట్​మ్యాన్ ఓపెనింగ్ పొజిషన్ నుంచి తప్పుకోవాలన్నాడు. ఈ ఏడాది జూన్​లో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు చేయక తప్పదన్నాడు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయగలడని చెప్పాడు. ఒక్కసారి జోరందుకున్నాడా అదే వేగంతో మ్యాచ్​ను ఫినిష్ చేయగలడని తెలిపాడు. 181 స్ట్రయిక్ రేట్​తో ఆడే సామర్థ్యం కింగ్ కోహ్లీకి ఉందని మెచ్చుకున్నాడు రవిశాస్త్రి. అయితే అతడికి తోడుగా ఇంకో ఎండ్​లో కూడా వేగంగా పరుగులు చేసే బ్యాట్స్​మన్ ఉండాలన్నాడు. తన దృష్టిలో వచ్చే టీ20 వరల్డ్ కప్​లో జైస్వాల్​తో పాటు మరో ఓపెనర్​గా కోహ్లీ బరిలోకి దిగడం కరెక్ట్ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అయితే హిట్​మ్యాన్​ను ఉద్దేశించి రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రవిశాస్త్రి వ్యాఖ్యలకు కొందరు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. హిట్​మ్యాన్ ఓపెనర్​గా పనికి రాడని ఎలా అంటాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్​లో రోహిత్ ఎలా ఆడాడో చూడలేదా? వన్డేల్లో కూడా టీ20 స్టైల్ బ్యాటింగ్​తో చెలరేగిన ప్లేయర్​పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫైర్ అవుతున్నారు. భారత జట్టు మాజీ కోచ్ అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే రోహిత్​కు జతగా కోహ్లీని మరో ఓపెనర్​గా పంపాలని లేదా జైస్వాల్​-రోహిత్​ జోడీనే కంటిన్యూ చేయాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్​లో హిట్​మ్యాన్ తన అనుభవం రంగరించి ఆడతాడని అంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్నాడు కాబట్టి మరింత కసితో ఆడతాడని.. అతడి టాలెంట్​పై ఎలాంటి డౌట్స్ వద్దంటున్నారు. మరి.. రోహిత్ ఓపెనర్​గా వద్దంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ సింహం లాంటోడు.. అతడితో పెట్టుకుంటే ఇక అంతే: భారత మాజీ క్రికెటర్