iDreamPost

Virat Kohli: కోహ్లీ సింహం లాంటోడు.. అతడితో పెట్టుకుంటే ఇక అంతే: భారత మాజీ క్రికెటర్

  • Published Jan 16, 2024 | 6:41 PMUpdated Jan 17, 2024 | 3:13 PM

టీమిండియా స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీతో పెట్టుకోవద్దని ఓ భారత మాజీ క్రికెటర్ అంటున్నాడు. విరాట్ సింహం లాంటోడని.. అతడి జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్​ విరాట్​ కోహ్లీతో పెట్టుకోవద్దని ఓ భారత మాజీ క్రికెటర్ అంటున్నాడు. విరాట్ సింహం లాంటోడని.. అతడి జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నాడు.

  • Published Jan 16, 2024 | 6:41 PMUpdated Jan 17, 2024 | 3:13 PM
Virat Kohli: కోహ్లీ సింహం లాంటోడు.. అతడితో పెట్టుకుంటే ఇక అంతే: భారత మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ ఫుల్​ ఫామ్​లో ఉన్నాడు. ఆ మధ్య ఫామ్ కోల్పోయి కొన్నాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ గతేడాది తిరిగి రిథమ్ అందుకున్న కింగ్.. అప్పటి నుంచి తన బ్యాట్ పవర్ చూపిస్తూ వస్తున్నాడు. ఫామ్ అందుకున్న తర్వాత నుంచి కోహ్లీని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. గతేడాది ఆసియా కప్​లో పరుగుల వేట మొదలుపెట్టిన విరాట్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్-2023లో దాన్ని కంటిన్యూ చేశాడు. మెగాటోర్నీలో ఏకంగా 765 పరుగుల బాది ప్రపంచ కప్​ హిస్టరీలో సింగిల్ ఎడిషన్​లో హయ్యెస్ట్ రన్స్ చేసిన బ్యాటర్​గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్​లో ఓడిపోయినా ఆ బాధను దిగమింగుకొని సౌతాఫ్రికా టూర్​లోనూ రాణించాడు. విరాట్ బాగా ఆడటం వల్లే సఫారీలతో టెస్ట్ సిరీస్​ను టీమిండియా డ్రా చేసుకుంది. అలాంటి కోహ్లీని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆకాశానికెత్తేశాడు. విరాట్ సింహం లాంటోడని చెప్పాడు. అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు అని హెచ్చరించాడు.

కోహ్లీ సింహం లాంటోడని.. అతడితో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు ఆకాశ్ చోప్రా. ‘మనం అడవిలోకి వెళ్లేందుకు భయపడతాం. ఎందుకంటే అక్కడ సింహం ఉంటుంది. సింహం అడ్డగోలుగా తినదు. కానీ ఎక్కడ తినేస్తుందోనని జడుసుకుంటాం. విరాట్ కోహ్లీ సింహం లాంటోడు. ఎందుకంటే కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు అవతలి జట్టుకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. అతడు ప్రతిసారి పరుగులు చేయకపోవచ్చు. కానీ విరాట్ ఏ క్షణంలోనైనా గేర్లు మార్చి మ్యాచ్​ను భారత్​ వైపునకు తిప్పేస్తాడు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అడవిలో సింహం ఉన్నట్లే.. టీమిండియా ఇన్నింగ్స్​ టైమ్​లో కోహ్లీ క్రీజులో ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపాడు. విరాట్ పరుగులు చేసినా, చేయకపోయినా క్రీజులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నాడు.

టీ20 వరల్డ్ కప్-2024లో విరాట్ కోహ్లీని తప్పకుండా ఆడించాలని ఆకాశ్ చోప్రా అన్నాడు. కోహ్లీ టీమ్​లో ఉంటే ప్రత్యర్థి జట్లు గడగడలాడతాయని చెప్పాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు అటాక్ చేయమన్నా అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. అయితే కోహ్లీ ఎలా ఆడితే బెటర్ అనేది టీమ్ మేనేజ్​మెంట్ డిసైడ్ అవ్వాలని పేర్కొన్నాడు. ‘టీ20 ప్రపంచ కప్​కు ఆతిథ్యం ఇస్తున్న యూఎస్​ఏ, వెస్టిండీస్ పిచ్​లపై 150 నుంచి 160 మధ్కే స్కోర్లు నమోదవుతాయి. 200 నుంచి 220కి పైగా టార్గెట్లు సెట్ చేయడం అక్కడ కుదరదు. అలాంటప్పుడు టీమ్​లో కోహ్లీ ఉండటం ఎంతో కీలకం. అతడు జట్టును నడిపిస్తాడు. మ్యాచ్​ను ఫినిష్ చేయడం ఎలాగో అతడికి తెలుసు. విరాట్ ఒక ఎండ్​లో ఉంటే మిగిలిన ఎండ్​లో ఇతర ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాట్​ను ఝళిపించొచ్చు. టీ20ల్లో కోహ్లీ రోల్ ఇలాగే ఉండే అవకాశం ఉంది’ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. మరి.. కోహ్లీపై ఆకాశ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RCB, Prabhas: రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు RCB జెర్సీ అందజేత! ఎందుకంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి