iDreamPost

రోహిత్ శర్మ అరుదైన ఘనత.. గంగూలీ రికార్డ్ బ్రేక్!

వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో అద్భుత విజాయాలతో దూసుకెళ్తోంది టీమిండియా. ఈ మెగాటోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచి.. సూపర్ 8కు దర్జాగా వెళ్లింది. ఇక అమెరికాపై విజయం సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రికార్డు ను బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ఆ వివరాల్లోకి వెళితే..

పొట్టి ప్రపంచ కప్ లో అమెరికాపై విజయం సాధించడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే? ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్రసింగ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ధోని ఐసీసీ టోర్నీల్లో 58 మ్యాచ్ లకు సారథ్యం వహించి 40 విజయాలు జట్టుకు అందించాడు. ఇక దిగ్గజం సౌరవ్ గంగూలీ 22 మ్యాచ్ ల్లో 16 విజయాలు భారత్ కు అందించాడు. తాజాగా అమెరికాపై సాధించిన విజయంతో దాదా రికార్డ్ ను బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. రోహిత్ ఐసీసీ టోర్నీల్లో 17 విజయాలు అందించిన టీమిండియా రెండో కెప్టెన్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 8 వికెట్లుకు 110 పరుగులు చేయగా.. టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి