Tirupathi Rao
Tirupathi Rao
టీమిండియా ఫ్యాన్స్ ఇది చాలా మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే స్టార్ బ్యాటర్, కీపర్ రిషబ్ పంత్ తిరిగి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. కారు ప్రమాదంలో గాయపడి, మేజర్ సర్జరీ చేయించుకున్న పంత ఇటీవలే కోలుకున్నాడు. ఇప్పుడు ఏకంగా బ్యాట్ తీసుకుని మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నాడు. పంత్ కోలుకుంటున్నాడు అంటూ చాలా రోజులుగా ఫ్యాన్స్ వింటున్నారు. కానీ, ఇలా బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావడం ఇదే తొలిసారి కావడంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
రిషబ్ పంత్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఒక ఘోర కారు ప్రమాదంలో గాయపడి పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతని కోసం ఒక స్పెషల్ కోర్సు తయారు చేసి మరీ ట్రైన్ చేస్తున్నారు. అందులో స్ట్రెంగ్త్, రన్నింగ్, ఫ్లెక్సిబిలిటీ కలగలిపి డిజైన్ చేసినట్లు బీసీసీఐ చెప్పింది. ఇప్పుడు తాజాగా రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించేశాడు. జేఎస్ డబ్ల్యూ విజయ్ నగర్లో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ పాల్గొన్నాడు. ఆ మ్యాచ్ లో బ్యాట్ తీసుకుని మైదానంలో మెరుపులు మెరిపించాడు. ఊరికే ఆడటం కాకుండా అప్పటి పదును ప్రదర్శిస్తూ సిక్సులు కూడా కొట్టాడు. పంత్ మైదానంలో అడుగు పెట్టే సమయం నుంచి అతను ఆడినంతసేపు అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు.
రిషబ్ పంత్ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా భావన కలిగేలా ఫ్యాన్స్ అంతా చీర్ చేశారు. అక్కడే ఉన్న ఒక ఫ్యాన్ పంత్ బ్యాటింగ్ ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంకా పంత్ ఇంకా పూర్తిగా సన్నద్ధం అయ్యాడని చెప్పడానికి లేదు. నిజానికి పంత్ కీపింగ్, బ్యాటింగ్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్న విషయాన్ని జూలై 21నే బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో అందరూ పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించాలని, తిరిగి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో పంత్ లేని లోటు అందరికీ బాగా కనిపిస్తోంది. అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో ఒక్క టీమిండియానే కాదు.. ఫ్యాన్స్ కూడా రిషబ్ పంత్ ఆటను బాగా మిస్ అవుతున్నారు.
Enjoyment and excel is the new mantra ! @RishabhPant17 Thanks for becoming a part of the celebration! @TheJSWGroup pic.twitter.com/WvzOExLc75
— Sangita Jindal (@SangitaSJindal) August 15, 2023
రిషబ్ పంత్ ఇప్పటి నుంచే పంత్ ప్రాక్టీస్ ప్రారంభించి ఫిట్ నెస్ సాధించినా కూడా.. వరల్డ్ కప్ స్క్వాడ్ పంత్ కు చోటు దక్కడం కష్టమే అంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే శారీరకంగా, మానసికంగా పంత్ ఇంకా సన్నద్ధం కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మళ్లీ పంత్ ఏదో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భావన కలుగుతోందని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పంత్ యాక్సిడెంట్ విషయానికి వస్తే.. గతేడాది డిసెంబర్ 30న పంత్ కారుకు ఘోర ప్రమాదం సంభవించింది. అతను అర్ధరాత్రి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిద్రపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. అందులో ఉన్న పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతను సమయస్ఫూర్తితో గ్లాస్ పగలగొట్టి బయట పడ్డాడు. ఆ తర్వాత కారు పూర్తిగా కాలిపోయింది.
Rishabh Pant has resumed batting practice.
An excellent news for Indian cricket! pic.twitter.com/5I2Q6tsaeE
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023