iDreamPost
android-app
ios-app

వీడియో: సచిన్‌తో నాటునాటు స్టెప్పులు వేయించిన రామ్‌ చరణ్‌!

  • Published Mar 06, 2024 | 5:13 PM Updated Updated Mar 06, 2024 | 5:13 PM

Ram Charan, Sachin Tendulkar: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ నాటునాటు పాటకు స్టెప్పులు వేయించాడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. అది ఎక్కడో? ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ram Charan, Sachin Tendulkar: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ నాటునాటు పాటకు స్టెప్పులు వేయించాడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. అది ఎక్కడో? ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 06, 2024 | 5:13 PMUpdated Mar 06, 2024 | 5:13 PM
వీడియో: సచిన్‌తో నాటునాటు స్టెప్పులు వేయించిన రామ్‌ చరణ్‌!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరు కొన్ని రోజులుగా మారిమోగిపోతుంది. ఆయన సినిమాలు రిలీజ్‌ కాకపోయినా ఈ మెగా హీరో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా ఉంటారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి చరణ్‌ ఒక్కడికే ఆహ్వానం అందడం, ఆ వేడుకల్లో చరణ్‌ను స్టేజ్‌పైకి పిలిచే క్రమంలో షారుఖ్‌ ఖాన్‌ వ్యవహరించిన తీరుతో రామ్‌ చరణ్‌ పేరు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి.. ఏకంగా క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, తమిళ హీరో సూర్యతో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీలతో నాటునాటు పాటకు స్టెప్పులు వేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ముంబై వేదికగా ఐఎస్‌పీఎల్‌(ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌) ప్రారంభ వేడుకల్లో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఆరంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌, అక్షయ్‌ కుమార్‌, సూర్య, బొమన్‌ ఇరానీతో కలిసి రామ్‌ చరణ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు. వారితో నాటునాటు స్టెప్పులు వేయించాడు. కాగా, దేశంలోని యంగ్‌ క్రికెట్‌ టాలెంట్‌ను వెలికితీసే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో ఆరంభ మ్యాచ్‌గా.. క్రికెటర్లు వర్సెస్‌ సినిమా హీరోల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ లీగ్‌కు కోర్‌ కమిటీ మెంబర్‌గా సచిన్‌ ఉండటం విశేషం. ఈ లీగ్‌లో మొత్తం 6 టీమ్స్‌ పాల్గొంటున్నాయి. వీటిలో మజ్‌హీ ముంబైకి అమితాబ్‌ బచ్చన్‌, శ్రీనగర్‌ కే వీర్‌ జట్టుకి అక్షయ్‌ కుమార్‌, బెంగళూరు స్టైకర్స్‌కి హృతిక్‌ రోషన్‌, చెన్నై సింగమ్స్‌ జట్టుకు సూర్య, ఫాల్కాన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు రామ్‌ చరణ్‌, టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కత్తా టీమ్‌కి సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ ఓనర్స్‌గా ఉన్నారు.

మార్చి 6న నుంచి 15వ తేదీ వరకు ముంబైలోని దాదోజీ కొండదేవ్‌ స్టేడియం వేదికగా జరగనున్నాయి. యంగ్‌ ప్లేయర్లను ఎంపిక చేసి.. ఈ లీగ్‌ను టెన్నిస్‌ బాల్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో రాణించిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ లీగ్‌ ముఖ్య ఉద్దేశం. అయితే.. ఈ లీగ్‌ ప్రారంభ సమయంలో క్రికెట్‌ స్టార్‌, హీరోలతో నాటునాటు పాటకు స్టెప్పులు వేయించడంతో.. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌తో కూడా నాటు నాటు స్టెప్పులు వేయించాడు ఇదీ రామ్‌ చరణ్‌ రేంజ్‌ అంటూ చరణ్‌ అభిమానులు పరోక్షంగా షారుఖ్ ఖాన్‌కు చురకలు అంటిస్తున్నారు. మరి యంగ్‌ టాలెంట్‌ను వెలికి తీసేందుకు ఈ లీగ్‌ నిర్వహించడం, అలాగే సచిన్‌తో రామ్‌ చరణ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.