iDreamPost

తిలక్‌ వర్మ-సురేష్‌ రైనా.. అచ్చుగుద్దినట్లు రికార్డులన్నీ సేమ్‌

  • Published Aug 10, 2023 | 1:36 PMUpdated Aug 10, 2023 | 1:36 PM
  • Published Aug 10, 2023 | 1:36 PMUpdated Aug 10, 2023 | 1:36 PM
తిలక్‌ వర్మ-సురేష్‌ రైనా.. అచ్చుగుద్దినట్లు రికార్డులన్నీ సేమ్‌

భారత యువ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం అతనే టీమిండియాలో కీ ప్లేయర్‌. పిచ్‌ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. టీమ్‌లోని మిగతా హేమాహేమీలు చేతులెత్తేసినా.. తన మాత్రం జట్టుకు వెన్నుముకలా నిలుస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న భారత జట్టుకు అతనే పెద్ద దిక్కులా కనిపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ రెండో మ్యాచ్‌ల్లోనే టీమిండియా పరువును కాస్తో కూస్తో నిలిపింది తిలక్‌ వర్మనే.

తొలి మ్యాచ్‌లో 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన తిలక్‌.. రెండో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో టీమిండియా మళ్లీ తనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా గెలిచిన మూడో టీ20లోనూ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా మూడు మ్యాచ్‌ల్లోనూ తిలక్‌ వర్మ అద్భుతంగా ఆడాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు అతనే భవిష్యత్తు స్టార్‌ అంటూ పలువురు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. కాగా.. తిలక్‌ వర్మకు సంబంధించిన కొన్ని గణంకాలు టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనాను పోలి ఉండటం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ రికార్డులు చూస్తే.. టీమిండియాలోకి రైనా తిరుగొచ్చాడా అని అనిపించకమానదు.

అవేంటో ఇప్పుడు చూద్దాం.. సురేష్‌ రైనా తన 20వ ఏట అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అడుగుపెడితే.. తిలక్‌ సైతం 20 ఏళ్ల వయసులోనే టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అలాగే.. తన తొలి టీ20లో రైనా రెండు క్యాచ్‌లు అందుకుంటే.. తిలక్‌ సైతం రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. రైనా తన తొలి టీ20 హాఫ్‌ సెంచరీని జట్టు చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో చేశాడు.. తిలక్‌ వెస్టిండీస్‌తో రెండో టీ20లో చేసిన తన తొలి టీ20 హాఫ్‌ సెంచరీ సైతం ఎంతో క్రూషియల్‌ పరిస్థితుల్లో వచ్చింది.

ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సురేష్‌ రైనా సైతం 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో తిలక్‌ వర్మ కూడా 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక అన్నింటి కంటే పెద్ద కో ఇన్నిడెంట్‌ ఏంటంటే.. సురేష్‌ రైన తన తొలి రెండు ఐపీఎల్‌ సీజన్స్‌లో 350 ప్లస్‌ పరుగులు చేస్తే.. తిలక్‌ వర్మ కూడా తన తొలి రెండు ఐపీఎల్‌ సీజన్స్‌ 2022, 23లో 350 ప్లస్‌ రన్స్‌ చేశాడు. పైగా ఇద్దరూ లెఫ్ట్‌ హ్యాండర్లు కావడంతో.. టీమిండియాలోకి తిలక్‌ వర్మ రూపంలో రైనా తిరిగొచ్చాడని క్రికెట్‌ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని వాడిన బ్యాట్‌ ధర రూ.83 లక్షలా? మతిపోయే నిజం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి