మరోసారి తన కుళ్లు బుద్ధిని బయటపెట్టుకున్నాడు పాక్ కోచ్ మిక్కీ అర్థర్. శుబ్ మన్ గిల్ కు నెంబర్ 1 ర్యాంక్ రావడంపై తన కడుపు మంటను వెళ్లగక్కాడు.
మరోసారి తన కుళ్లు బుద్ధిని బయటపెట్టుకున్నాడు పాక్ కోచ్ మిక్కీ అర్థర్. శుబ్ మన్ గిల్ కు నెంబర్ 1 ర్యాంక్ రావడంపై తన కడుపు మంటను వెళ్లగక్కాడు.
ప్రపంచ కప్ లో దుమ్మురేపే ప్రదర్శనతో ప్రతర్థులను చిత్తు చేసి సెమీస్ కు దర్జాగా వెళ్లింది టీమిండియా. ఇక భారత ప్లేయర్లు ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో సత్తాచాటారు టీమిండియా ప్లేయర్లు. బ్యాటింగ్, బౌలింగ్ లో అగ్రస్థానంలో ఉన్నారు. బాబర్ ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్. కేవలం 24 ఏళ్లకే నెంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు గిల్. ఇక ఇది చూసిన పాక్ కోచ్ కు కడుపు మండిపోతున్నట్లుగా ఉంది. కొన్ని చౌకబారు కామెంట్స్ చేసి.. ప్రపంచం ముందు పరువుపోగొట్టుకుంటున్నారు.
టీమిండియా.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న శక్తి. ఇప్పటికే వన్డే, టెస్టు, టీ20 టీమ్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక తాజాగా ప్రకటించిన వ్యక్తిగత ర్యాంకింగ్స్ ల్లో కూడా దుమ్ములేపారు భారత ప్లేయర్లు. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ ల్లో బ్యాటర్ల లో శుబ్ మన్ గిల్, బౌలర్లలో సిరాజ్, టీ20 బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్లలో అశ్విన్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. ఇన్ని విభాగాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నందుకు పాకిస్థాన్ కోచ్ కు కడుపు మండుతున్నట్లు ఉంది. పైగా బాబర్ అజాంను వెనక్కి నెట్టి గిల్ నెంబర్ వన్ ర్యాంకుకు రావడంతో టీమిండియాపై పడి ఏడుస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని చౌకబారు కామెంట్స్ చేసి.. తమ కుళ్లు బుద్దిని మరోసారి బయటపెట్టుకున్నాడు. “తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ ఐసీసీ ర్యాంకుల్లా లేవు. అవి బీసీసీఐ ప్రకటించిన ర్యాంకుల్లా ఉన్నాయి” అంటూ అర్దం పర్దం లేని కామెంట్స్ చేశాడు పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్. ఇక ఈ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఆటగాళ్లకు మంచిగా కోచింగ్ ఇవ్వకుండా ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడ్డం ఎందుకు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. టీమిండియాపై తమ కుళ్లు బుద్దిని వెళ్లగక్కడానికి ఎప్పుడెప్పుడు సమయం చిక్కుతుందా అని పాక్ ఆటగాళ్లు, మాజీ ప్లేయర్లు ఎదురుచూస్తూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంటూ పాక్ కోచ్ తన ఏడుపును బయటపెట్టుకున్నాడు. కాగా.. వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో పాక్ 93 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 244 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
Mickey Arthur’s statement on latest ICC rankings pic.twitter.com/ncWObdAXfH
— saj (@sajchaudhary786) November 9, 2023