iDreamPost
android-app
ios-app

వన్డే వరల్డ్ కప్​పై గిల్​క్రిస్ట్ ప్రెడిక్షన్.. సెమీస్​కు ఆ నాలుగు జట్లు అంటూ..!

  • Author singhj Published - 09:19 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 09:19 PM, Tue - 19 September 23
వన్డే వరల్డ్ కప్​పై గిల్​క్రిస్ట్ ప్రెడిక్షన్.. సెమీస్​కు ఆ నాలుగు జట్లు అంటూ..!

ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 5వ తేదీన ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. దీంతో ఈసారి ఏ జట్టు కప్ గెలుస్తుందా అని ప్రెడిక్షన్స్ షురూ అయ్యాయి. ఫలానా టీమ్ నెగ్గుతుందని కొందరు అంటుంటే.. కాదు ఫలానా టీమే కప్ ఎగరేసుకుపోతుందంటూ రకరకాల అంచనాలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ ఆడమ్ గిల్​క్రిస్ట్ స్పందించాడు. వచ్చే వరల్డ్ కప్​లో ఏయే టీమ్స్ ముందంజ వేస్తాయో ఆయన అంచనా వేశాడు. ప్రపంచ కప్​లో నాలుగు టీమ్స్ తప్పకుండా సెమీస్​కు చేరుకుంటాయన్నాడు.

వన్డే వరల్డ్ కప్​-2023లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్స్ టైటిల్ ఫేవరెట్​గా కనిపిస్తున్నాయని గిల్​క్రిస్ట్ అన్నాడు. ఈ నాలుగు జట్లు తప్పకుండా సెమీఫైనల్స్​కు వస్తాయని అభిప్రాయపడ్డాడు. గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ మాజీ ఆసీస్ ప్లేయర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గిల్​క్రిస్ట్.. వచ్చే ప్రపంచ కప్​లో టీమ్స్ ప్రదర్శన, ఫేవరెట్స్ ఎవరనే దాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు కచ్చితంగా సెమీస్​కు చేరుకుంటాయని జోస్యం పలికాడు.

వరల్డ్ కప్​ ఫేవరెట్స్ గురించి మాట్లాడిన గిల్​క్రిస్ట్.. ఆస్ట్రేలియా టీమ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘సౌతాఫ్రికా పర్యటన నుంచి ఆసీస్ పాఠాలు నేర్చుకుంటుంది. ఈ సిరీస్​లో తొలి రెండు వన్డేల్లో నెగ్గిన కంగారూ జట్టు.. ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ ఓడి సిరీస్​ను చేజార్చుకుంది. ఆసీస్ టీమ్ ఇప్పుడు భారత పర్యటనకు రానుంది. వరల్డ్ కప్​కు ముందు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్​కు ఆస్ట్రేలియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. టీమ్​లో చాలా మంది అనుభవజ్ఞులున్నారు. వాళ్లు భయం లేకుండా ఆడాలి’ అని గిల్​క్రిస్ట్ సూచించాడు.

ఇదీ చదవండి: చాహల్​ గొడవపడ్డాడంటున్న హర్భజన్!