• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » sports » Yuzvendra Chahal Selection Harbhajan Comments

చాహల్​ను సెలెక్ట్ చేయకపోవడంపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు! గొడవపడ్డాడంటూ..

  • By singhj Published Date - 07:27 PM, Tue - 19 September 23 IST
చాహల్​ను సెలెక్ట్ చేయకపోవడంపై హర్భజన్ సంచలన వ్యాఖ్యలు! గొడవపడ్డాడంటూ..

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్​కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు పలువురు ప్రధాన ఆటగాళ్లను దూరం పెట్టింది. ఆసియా కప్​లో బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో గాయపడిన స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్​ను​ మొదటి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అలాగే తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. ఈ రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. మూడో మ్యాచ్​లో కోహ్లీ, హార్దిక్ అందుబాటులో ఉంటారు. మూడో మ్యాచ్​కు రోహిత్ తిరిగి జట్టు పగ్గాలు చేపడతాడు.

ఆసీస్​తో మూడు వన్డేల సిరీస్​కు ప్రకటించిన జట్టులో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​కు చోటు దక్కలేదు. ఆసియా కప్​లో గాయపడిన అక్షర్ పటేల్ ప్లేసులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. వన్డే ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు ఇటీవల ప్రకటించిన 15 మంది సభ్యుల స్క్వాడ్​లోనూ చాహల్​కు చోటు దక్కని విషయం విదితమే. ఈ నేపథ్యంలో చాహల్​ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. అసలు చాహల్​ను ఎందుకు సెలెక్ట్ చేయలేదనేది తనకు అర్థం కావడం లేదన్నాడు. టీమ్​లో ఉండాల్సిన ప్లేయర్లలో చాహల్ ఒకడని.. టాలెంట్ పరంగా అతడు అద్భుతమన్నాడు భజ్జీ.

‘ఆస్ట్రేలియాతో సిరీస్​కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ ఉంటే బాగుండేది. అతడికి ఛాన్సులు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకిలా జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా? అనేది తెలియడం లేదు. కేవలం మనం టాలెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అతడు జట్టులో ఉండాల్సిన ఆటగాడు. కనీసం కంగారూలతో వన్డే సిరీస్​లోకైనా చాహల్​ను తీసుకుంటే బాగుండేది. చాలా మంది ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆసీస్​ను ఓడించాలంటే బాగా కష్టపడాలి’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: రజినీకి BCCI గోల్డెన్ టికెట్.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?

Tags  

  • cricket news
  • Harbhajan Singh
  • India vs Australia
  • Team India
  • Yuzvendra Chahal

Related News

వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?

వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?

మరికొన్ని రోజుల్లో వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5 నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి టాస్‌ పడనుంది. ఇప్పటికే వామప్‌ మ్యాచ్‌లు సైతం జరుగుతున్నాయి. ప్రధాన జట్లన్నీ.. వరల్డ్‌ కప్‌ కోసం సంసిద్ధమయ్యాయి. ఈ వరల్డ్‌ కప్‌ను ఎలాగైన కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే.. వరల్డ్‌ కప్‌ టోర్నీ అనగానే కేవలం కప్పు ఒక్కటే కాకుండా పలు రికార్డుల వేట కూడా ఉంటుంది. గతంలో నెలకొల్పిన రికార్డులు బ్రేక్‌ చేసేందుకు కూడా ఆటగాళ్లు ఉత్సాహంగా […]

13 hours ago
ఇదే నా చివరి వరల్డ్‌ కప్‌ కావొచ్చు.. టీమిండియా స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

ఇదే నా చివరి వరల్డ్‌ కప్‌ కావొచ్చు.. టీమిండియా స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

14 hours ago
కోహ్లీకి పోటీగా ఫీల్డింగ్‌ ఫొటోలను షేర్‌ చేసిన యువీ, జాంటీ రోడ్స్‌! ఎవరు బెస్ట్‌?

కోహ్లీకి పోటీగా ఫీల్డింగ్‌ ఫొటోలను షేర్‌ చేసిన యువీ, జాంటీ రోడ్స్‌! ఎవరు బెస్ట్‌?

14 hours ago
క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు తప్పని ముప్పు

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు తప్పని ముప్పు

15 hours ago
ధోనిని కొట్టేవాడే లేడు! గంభీర్‌ నుంచి బిగ్‌ స్టేట్‌మెంట్‌

ధోనిని కొట్టేవాడే లేడు! గంభీర్‌ నుంచి బిగ్‌ స్టేట్‌మెంట్‌

15 hours ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    7 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    7 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    9 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    10 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    10 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    10 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    11 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    12 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    12 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    12 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    12 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    12 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    13 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version